Dailyhunt
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

వార్త 6 days ago

గిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 'వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే' అని ఆయన గట్టిగా ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ఆశీర్వాదం తమకే ఉందని, ప్రజలు మళ్లీ అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారని కేసీఆర్ తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయిందని ఆయన పేర్కొన్నారు.

Read Also : Chandrababu Birthday: మిత్రులకు మరియు పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు: చంద్రబాబు

అడ్డగోలు హామీలంటూ విమర్శలు

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అసాధ్యమైన, అడ్డగోలు మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన వారు ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల అమలులో ప్రభుత్వం వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపించిన కేసీఆర్, ప్రజలు అప్పుడే తమ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల శంఖారావం

జగిత్యాల సభను కేసీఆర్ రాబోయే రాజకీయ పోరాటానికి నాందిగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటించారు. జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు పార్టీలోకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగులేదని, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో గెలిచిన పార్టీ ఎక్కువ కాలం నిలవదని, తిరిగి తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ సరికొత్త చర్చకు దారితీసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్; పైలట్, కో-పైలట్ మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha