Dailyhunt
అంబేడ్కర్ ఆశయాలే మా మార్గం: ప్రధాని మోదీ ధీమా

అంబేడ్కర్ ఆశయాలే మా మార్గం: ప్రధాని మోదీ ధీమా

వార్త 1 week ago

ర్టికల్ 370 రద్దు తర్వాతే భారతదేశంలో రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంబేడ్కర్ కలలుగన్న సామాజిక న్యాయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమలవుతోందని, గతంలో రాజ్యాంగం చేరని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలన సాగుతోందని కొనియాడారు.

‘నారీశక్తి వందన్ అదినియం’ గురించి మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఏమాత్రం జాప్యం జరగకూడదని ప్రధాని తెలిపారు.2029 లోక్‌సభ ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు.

Read Also: Ambedkar Jayanti 2026: రాజ్యాంగ నిర్మాతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు

 PM Modi

పార్లమెంటు చర్చ: దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేక చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్:
₹12,000 కోట్లతో నిర్మించిన 213 కిలోమీటర్ల పొడవైన ఈ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధాని ప్రారంభించారు.సమయం ఆదా: దీనివల్ల ఢిల్లీ నుండి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గనుంది.వన్యప్రాణుల రక్షణ: ఈ కారిడార్‌లో ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించడం విశేషం. దిల్లీ-దెహ్రాదూన్‌ ఎకనామిక్ కారిడార్‌ వల్ల ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి సుమారు 3 గంటలకు తగ్గనుంది. 213 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల ఎకనామిక్ కారిడార్‌ను 12వేల కోట్లతో నిర్మించారు.

మొదట సహారన్‌పూర్‌లో ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నిర్మించిన ఎలివేటెడ్ సెక్షన్‌లో వన్యప్రాణుల కారిడార్‌ను ప్రధాని పరిశీలించారు. సహారన్‌పూర్, దెహ్రాదూన్ వీధుల్లో రోడ్ షో నిర్వహించారు.దెహ్రాదూన్ సమీపంలోని మా దత్ కాళీ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2029లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. 2029 నుంచే ఈ రిజర్వేషన్లు అమలు కావాలి. ఇది దేశంలో ప్రతీ సోదరి, ఆడవిడ్డ కోరిక. మాతృశక్తి ఆకాంక్షను గౌరవిస్తూ ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో చర్చలు జరుగుతాయి. మహిళలకు సంబంధించిన ఈ పనిని అన్ని పార్టీలు కలిసి ఏకాభిప్రాయంతో పూర్తి చేయాలి’ అని ప్రధాని మోదీ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బిహార్‌లో రాజకీయ మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha