Ambedkar: ఈప్రపంచంలోనే ఎక్కువ విగ్రహా లున్న మహనీయుడు అంబేద్కర్. అలాగే పగులగొడుతున్న విగ్రహాలు అంబేద్కర్ గారివే. ఆయన విగ్రహాలను నాశనం చేయవచ్చుకాని సిద్దాంతాలను కాదు.
ఈ దేశంలో కృష్ణుడు సనాతనాన్ని (హిందూయి జాన్ని), మొఘల్స్ ఇస్లాంని, బ్రిటీషర్స్ క్రైస్తవాన్ని బోధించారు కాని అంబేద్కర్ లాంటివారు మనల్ని మనుషులుగా మార్చిన మహనీయుడు. చరిత్రకారు లు చరిత్రను క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని ఏవిధంగా విభజించారో అదే విధంగా ఆధునిక భారతాన్ని అంబేద్కర్పూర్వం, అంబేద్కర్ తరువాత అని చూడవచ్చు. ఎందుకంటే మన తలరాతలు అలా రాసివుంది ఏం చేద్దాం అని వెనుక బడిన వర్గాలు, కార్మి కులు, ముఖ్యంగా మహిళలు అంటూ ఉండే వారు. కానీ అంబేద్కర్ రాక అన్ని అపనమ్మకాలు, పుక్కిట పురాణాలు తల క్రిందు లైనాయి. ప్రస్తుతమున్న సమాజం, రాజకీయ నాయకులు అంబెడ్కర్ ఒక రిజర్వే షన్ను మాత్రమే అందించారు అని ప్రచారం చేస్తు న్నారు. కానీ ఆయన ఒక వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే కాదు అన్ని తరగతుల మహిళలకు, కార్మికులకు చేసిన మేలు ఎవరూ చేయలేదని మరిచిపోతున్నారు. ఆయన సాధించి పెట్టిన ప్రతి హక్కులు వెలకట్టలేనివి. అందరూ సమానం కాదు, ఎక్కువ తక్కువ అని తెలుసుకుని జీవిం చడమే ధర్మం. అలాగే జీవించాలని నాలుగు వర్ణాలను సుమారు నాలుగు వేల కులాలుగా విభజించి ఒకరికి ఎక్కువ, తక్కువగా ఒకరుండడమే న్యాయమని చెప్పబడిన భారత మనుధర్మం, విద్య నేర్చుకోకూడదు, దారిలో నడవ కూడదు, మొత్తానికి బానిసగా ఉండాలని, ఏ పని చెబితే ఆ పని చేయవలసిన పరిస్థితులలో అంబేద్కర్ రాక మొత్తం పరిస్థితినే మార్చేసింది. వెనుకబడిన వర్గాలకు, మహిళలకు నిరాకరించబడిన హక్కులకోసమే తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసారు.
Read Aslo : Ambedkar Jayanti 2026: రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళులు
Ambedkar
Ambedkar: నవ బుద్ధుడు
అంబేద్కర్ గారు ఎంత కాలం జీవించారు అనే దానికంటే ప్రస్తుతం వెనుకబడిన వర్గాలు, మహిళలు గర్వంగా, మర్యాదగా (బతుకుతున్నారంటే దానికి కారణమైన అంబేద్కర్ జన్మదినాన్ని వేడుకలా జరుపుకొని ఆయన ఆశయాలను పాటించాలి. సామాజిక న్యాయం అనేది న్యాయమైన సమాజాన్ని సృష్టించడానికి-ఒక సాధన మని, దానికి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అవసర మని అంబేద్కర్ విశ్వసించారు. సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం పోరాడిన సామాజిక సంస్కర్త అంబేదర్. సామాజిక న్యాయం ప్రతి మానవుడి స్వేచ్ఛ, సమానత్వం సోదరభావంపై ఆధారపడి ఉంటుందన్నారు. సామాజిక న్యాయం వ్యక్తులకు రాజకీయ, ఆర్థిక వనరులు హక్కుల సమాన పంపిణీని తెస్తుంది. ఒక వ్యక్తి హోదా పుట్టుక ఆధారంగా కాకుండా యోగ్యత ఆధారంగా ఉండే సమాజం కోసం ఆయన వాదించారు. మహిళా, కార్మిక సమా నత్వపు పోరాట యోధుడు ఆయన సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది భారత రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజ్యాంగంలో కులవివక్ష, అంటరానితనాన్ని నిషేధించే నిబంధనలు ఉం డేలా ఆయన చూసుకున్నారు. రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమా నత్వంసోదర భావం అనే సూత్రాలను పొందుపరిచారు. సమానత్వపు హక్కు అంటే అందరూ సమానంగా చూడడం కాదు అంద రికీ సమాన అవకాశాలు సమాన హక్కులను ఇవ్వడమే. అదే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కోసం తన పదవి నే తృణప్రాయంగా వదిలిన నవ బుద్ధుడు.
ధునిక సవ్యసాచి
1942లో 14 గంటల పని సమయ మున్న దానిని 8 గంటలు చేసిన మహ నీయుడు. మగవారి తో స్త్రీలు సమానమ ని, దానితోపాటు సమాన వేతనాన్ని పోరాడి తెచ్చింది అంబేద్కర్ గారని మరువకూడదు. అందుకే హిందూకోడ్ బిల్ మహిళ లకు వంశపారంపర్య ఆస్థిలో సమానవాటా, పిల్లలను దత్తత తీసుకునే హక్కు, విడాకుల హక్కులను చేర్చారు. చీమలకు చక్కెరను, దాహనికి నీరుని ఇచ్చే మనిషికి జాతి, మతమెం దుకు అని అడిగిన దార్శనికుడు. ఏ అంబేద్కర్కి చదువు చెప్పడానికి నిరాకరించారో, నీళ్లు ఇవ్వడానికి నిరాకరించారో, ఏ అంబేద్కర్కి ఇల్లు ఇవ్వమని చెప్పారో, ఏ అంబేద్కర్ని బండి ఎక్కించము అని చెప్పారో అదే అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా పార్లమెంట్ లోపలికి అడుగు పెడుతుంటే వారే అందరూ లేచి నిలబడి గౌరవించారు. అదే చరిత్ర అదే అంబేద్కర్. తన బాల్యజీవితంలో మర్యాదే లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. అటువంటి కాలంలో దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అకుంటిత దీక్షతో రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు, మహిళల కు, కార్మికులకు సమానత్వాన్ని, హక్కులను, గౌరవాన్ని సాధించి పెట్టారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో లేప్టాప్ (కంప్యూటర్) లేదంటే చదవలేమని, ఏసీ లేదంటే చదవలే మని చెప్పే పిల్లలుంటే, ఆ కాలంలో చదువే నిరాకరించ బడిన అంబేద్కర్ ఆ స్థాయికి చేరడంటే అతని పట్టుదల, అణగారిన వర్గాలకి, మహిళాలోకానికి అందించిన హక్కు లు అతని చొరవే. ఆయన ఒక ఆధునిక సవ్యసాచి, అతను రాసి రాసి కుడిచేయి వ్రేలు బొబ్బలెక్కితే ఎడమచేతితో అలవాటు చేసుకుని వ్రాసిన మహనీయుడు.
నిజమైన మార్గదర్శి
విద్యా రంగానికి అంబేద్కర్ చేసిన కృషి, విద్యారంగంపై ఆయన అభిప్రాయం అన్ని సామాజిక రుగ్మతలకు విద్య ఒక్కటే గొప్ప ఔషధం అని ఆయన నమ్మారు. విద్యప్రాముఖ్యతను గ్రహించడానికి ఆయన దేనిని వదిలిపెట్టలేదు. ఉన్నత విద్య అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. విద్య మానవ సమాజంపై అపారమై న ప్రభావాన్ని చూపుతుంది. ఇది మానవ మనస్సు నుఆలో చించడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి శిక్షణ ఇస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మానవులు విద్యావంతులైన ప్పుడు హేతుబద్ధంగా మారతారు. విద్య ద్వారా మాత్రమే జ్ఞానం సమాచారం అందుతుంది. చదువురాని వ్యక్తులు చద వలేరు, వాయలేరు ప్రాపంచిక జ్ఞానం వారికి మూసివేయ బడతాయనీ, దీనికి విరుద్ధంగా విద్యావంతుడైన వ్యక్తి ప్రా పంచిక జ్ఞానాన్నిపొందుతారు. విద్య అంటే జ్ఞానాన్ని సంపా దించడం లేదా విద్యాహోదా పొందడం మాత్రమేకాదు. ఇది మనస్సు, స్వేచ్ఛా ఆలోచనను సృష్టించడానికి దారితీ యాలి అని చెప్పిన మహిమాన్వితుడు. ఆయన మరణించిన ఐదు దశాబ్దాల తర్వాత, అమలు చేయబడిన విద్యా హక్కు చట్టం (2009)లో అంబేద్కర్ అనేక ప్రగతిశీల ఆలోచనలున్నాయి. ఆయన అన్ని సామాజిక, ఆర్థిక వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి దృఢమైన పునాది వేయాలని పట్టుబట్టారు. వాస్తవానికి 1950లోనే ఆయన రాజ్యాంగంలో తప్పనిసరి ప్రాథమిక, ఉచిత విద్య కార్యక్రమానికి మార్గం సుగమం చేసి విద్యాహక్కు చట్టానికి బాటలు వేసిన నిజమైన మార్గదర్శి.
Ambedkar
కులవాదాన్ని నిర్మూలించడం
అంబేద్కర్ విద్యను వాణిజ్యీకరించడాన్ని వ్యతిరేకించాడు, విమర్శించాడు. పురుష విద్యను స్త్రీ విద్యతోపాటు కొనసాగిస్తే మన పురోగతి చాలా వేగవంతం అవుతుందని చెప్పారు. ఆయన ఆలోచనలు ఆవి ష్కరణలు ఆచరణాత్మకమైనవి, వాస్తవానికి అతను మహిళ లకు, బలహీన వర్గాలవారికి ఆదర్శంగా ఉన్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత కూడా చాలా మంది అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళిత పురుషులు మహిళలు నిరక్షరాస్యతకు ప్రధాన బాధితులుగా ఉన్నప్పటికీ, అంబేద్కర్ నేతృత్వం లోని ఉద్యమం నేడు ఫలాలను ఇస్తోంది. విద్య బలహీన వర్గాల విముక్తికి కీలకమైన మార్గదర్శిగా ఉద్భవించింది. చివ రగా అంబేద్కర్ గారు చెప్పినది ‘నన్ను దేవుడిలాగా చేయకండి నన్ను ఆయుధంలా చేసి పోరాడండని’ కోరారు. ప్రస్తుత ఆధునిక సమాజం ఆయన చెప్పిన విషయాలను సమాజం ముందు పెట్టిన విమర్శలు, అభిప్రాయాలు, అనుసరించిన వాటిని తెలుసుకుని, సమాజంలో సమసమాజ నిర్మాణానికి, కులవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం, సమైక్యతకు విఘాతం కలిగించే మనువాదాన్ని నిర్భయంగా తిరసకరించడమే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కు నిజమైన నివాళి కాగలదని, అందుకుయువత ప్రత్యక్షంగా అంబేద్కర్ కలలుగన్న ఆధునిక సమాజ స్థాపనకు కృషిచేయాలి.
-డాక్టర్ ఎ. భాగ్యరాజ
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
రాజ్యాంగ నిర్మాతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు

