Dailyhunt
రాజ్యాంగ నిర్మాతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు

రాజ్యాంగ నిర్మాతకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘన నివాళులు

వార్త 1 week ago

Ambedkar Jayanti 2026: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్న ముఖ్యమంత్రి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.

Read Also:DR BR Ambedkar Jayanti : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ప్రత్యేకం

రాజ్యాంగం ఆయన మనకు ఇచ్చిన గొప్ప కానుక

అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి బలమైన పునాది వేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, సమానత్వం మరియు న్యాయం ప్రాతిపదికన దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చూపిన బాట నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఈ మహనీయుని విలువలను కాపాడుకుంటూ, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

Ambedkar Jayanti 2026: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి

 Let us follow in the footsteps of the architect of the Indian Constitution: AP CM Chandrababu calls upon the people.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ శిల్పిగా అంబేద్కర్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

కుల వివక్షను ఎదుర్కొని, అణచివేతకు గురైన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. "అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన కృషి నిరంతరం మనకు స్ఫూర్తినిస్తుంది" అని ఎక్స్ (X) వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు. అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ధైర్యంగా ఎదుర్కొని, ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి గర్వకారణంగా నిలిచిన అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన ఆయన ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత అని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బిహార్‌లో రాజకీయ మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha