Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా డీఎన్‌ఐ పదవికి తులసి గబార్డ్ రాజీనామా

అమెరికా డీఎన్‌ఐ పదవికి తులసి గబార్డ్ రాజీనామా

వార్త 2 days ago

Tulsi Gabbard Resigns: అమెరికా జాతీయ నిఘా సంస్థ (Director of National Intelligence) డైరెక్టర్‌గా ఉన్న భారత సంతతి మహిళ తులసి గబార్డ్ తన పదవికి రాజీనామా చేశారు.

తన భర్త అబ్రహం విలియమ్స్‌కు అరుదైన బోన్ క్యాన్సర్ (ఎముకల క్యాన్సర్) సోకినట్లు నిర్ధారణ కావడంతో, ఈ క్లిష్ట సమయంలో ఆయనకు అండగా ఉండేందుకే తాను ప్రజా సేవ నుండి తప్పుకుంటున్నట్లు ఆమె శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపారు. ఆమె రాజీనామా జూన్ 30, 2026 నుండి అమలులోకి రానుంది.

Read Also :Iran Vs US War : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్ధమైన ట్రంప్?

 US DNI Director Tulsi Gabbard

భర్తకు తోడుగా ఉండేందుకే..

రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకుంటూ తులసి భావోద్వేగానికి గురయ్యారు. “నా భర్తకు ఇటీవల అరుదైన బోన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. రాబోయే రోజుల్లో ఆయన పెద్ద ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఈ కష్ట సమయంలో ఆయన పక్కనే ఉండి తోడుగా నిలవడం నా బాధ్యత. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని బాధ్యతల నుండి వైదొలగుతున్నాను.” – తులసి గబార్డ్

స్పందించిన వైట్‌హౌస్.. తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరోన్ లూకాస్

తులసి గబార్డ్ రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆమె సేవలను కొనియాడారు. తులసి తమ ప్రభుత్వంలో అద్భుతంగా పనిచేశారని, ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆమె నిష్క్రమణ అనంతరం ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ ఆరోన్ లూకాస్ తాత్కాలిక డీఎన్‌ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వైట్‌హౌస్ ప్రకటించింది.

Tulsi Gabbard Resigns: విభేదాల వల్లేనా?.. ఊహాగానాలపై ఖండన

ఫిబ్రవరి 2025లో బాధ్యతలు స్వీకరించిన తులసి, సుమారు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగారు. అయితే ఇరాన్ వ్యవహారంలో అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని విధానాలతో ఆమె విభేదించారని, ఆ ఒత్తిడి వల్లే పదవి నుంచి తప్పుకున్నారంటూ కొన్ని అంతర్జాతీయ నివేదికలు ప్రచారం చేశాయి. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తులసి కార్యాలయంతో పాటు వైట్‌హౌస్ వర్గాలు కూడా గట్టిగా ఖండించాయి. ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ నుండి వైదొలగిన నాలుగో మహిళా ఉన్నతాధికారిగా తులసి గబార్డ్ నిలిచారు. తన భర్త క్యాన్సర్ చికిత్స కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు అమెరికన్ ప్రముఖులు, నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha