Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా F-1, J-1 వీసా నిబంధనలలో కీలక మార్పులు!

అమెరికా F-1, J-1 వీసా నిబంధనలలో కీలక మార్పులు!

వార్త 3 weeks ago

Harvard University: అమెరికా జాతీయ భద్రతా శాఖ (DHS) అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనలలో తీసుకువస్తున్న మార్పుల నేపథ్యంలో Harvard International Office (HIO) తన విదేశీ విద్యార్థులు మరియు పరిశోధకులను అప్రమత్తం చేసింది.

సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల కారణంగా, విదేశీ ప్రయాణాల్లో ఉన్నవారు సెప్టెంబర్ 15 నాటికే తిరిగి అమెరికాకు చేరుకోవాలని సూచించింది.

Read Also :USA vs Iran: 'ఎకనామిక్ D-Day' పేరుతో బారీ ఆంక్షలకు సిద్ధమైన యూఎస్!

Harvard University: నూతన వీసా మార్గదర్శకాల వివరాలు

  • ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) రద్దు: ఇప్పటివరకు విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు నిర్దిష్ట కాలమితి లేకుండా అమెరికాలో ఉండేందుకు వీలు కల్పిస్తున్న ‘Duration of Status’ విధానాన్ని రద్దు చేస్తున్నారు.
  • గరిష్ఠంగా 4 ఏళ్ల పరిమితి: కొత్త విధానం ప్రకారం F-1, J-1 వీసాదారుల I-94 ఫారమ్‌పై గరిష్ఠంగా 4 ఏళ్ల కాలపరిమితి లేదా కోర్సు ముగింపు తేదీతో కూడిన నిర్దిష్ట గడువును నమోదు చేస్తారు.
  • సెప్టెంబర్ 15 డెడ్‌లైన్ ప్రాధాన్యత:
    • ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులకు కొత్త నిబంధనల నుంచి కొంత మినహాయింపు లభిస్తుంది.
    • అయితే, సెప్టెంబర్ 15 తర్వాత దేశం వెలుపలకు వెళ్ళి తిరిగి అమెరికాలో ప్రవేశిస్తే, వారికి పూర్తిస్థాయిలో నూతన 4 ఏళ్ల పరిమితి నిబంధనలే వర్తిస్తాయి.
  • USCIS అనుమతి తప్పనిసరి: 4 ఏళ్లకు పైబడి సమయం పట్టే డాక్టోరల్ (Ph.D.), పరిశోధన కోర్సుల విద్యార్థులు గడువు పొడిగింపు కోసం నేరుగా యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • గ్రేస్ పీరియడ్ కుదింపు: కోర్సు పూర్తయిన తర్వాత దేశంలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్ (Grace Period) సమయాన్ని కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా తగ్గించనున్నారు.

అమెరికా - కెనడా మధ్య రగిలిన 'టారిఫ్' వార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha