Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా కు చెందిన విమానం మిస్సింగ్

అమెరికా కు చెందిన విమానం మిస్సింగ్

వార్త 3 months ago

మెరికా రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే భారీ విమానం బోయింగ్ KC-135 స్ట్రాటోట్యాంకర్ పర్షియన్ గల్ఫ్ గగనతలంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా గల్లంతైంది.

ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం, ఈ విమానం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బయలుదేరి ఖతార్ మీదుగా వెళ్తుండగా రాడార్ సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి కొద్ది క్షణాల ముందు విమానం నుంచి ‘7700’ అనే ప్రమాద సంకేతం (Emergency Code) వెలువడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సాధారణంగా విమానం గాలిలో ఉన్నప్పుడు ఏదైనా తీవ్రమైన సాంకేతిక లోపం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు పైలట్లు ఈ కోడ్‌ను జారీ చేస్తారు.

Read Also : భారత్ ఎల్‌పిజి అవసరాలు - 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్': అమెరికా కీలక వ్యాఖ్యలు

గాలిలోనే ఇంధనం నింపే ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’

బోయింగ్ KC-135 స్ట్రాటోట్యాంకర్ కేవలం సాధారణ రవాణా విమానం కాదు. దీనిని అమెరికా సైన్యం “ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్” గా పిలుస్తుంది. యుద్ధ విమానాలు గాలిలో ఉండగానే వాటికి ఇంధనం నింపే (Aerial Refueling) అసాధారణ సామర్థ్యం దీనికి ఉంది. యుద్ధ రంగంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ఫైటర్ జెట్లకు ఇది ప్రాణవాయువు లాంటిది. అటువంటి కీలకమైన విమానం, వ్యూహాత్మక ప్రాంతమైన పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తూ అదృశ్యం కావడం వెనుక ఏదైనా శత్రువుల కుట్ర ఉందా లేదా భారీ సాంకేతిక వైఫల్యం ఉందా అనే కోణంలో అమెరికా రక్షణ శాఖ ఆరా తీస్తోంది.

ముమ్మరంగా గాలింపు చర్యలు.. ఉత్కంఠలో ప్రపంచ దేశాలు

విమానం నుంచి సంకేతాలు నిలిచిపోయిన ప్రాంతాన్ని గుర్తించిన రక్షణ దళాలు, అక్కడ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ అదృశ్యం చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విమానంలోని సిబ్బంది పరిస్థితి ఏంటి? విమానం సముద్రంలో కూలిపోయిందా లేక మరేదైనా జరిగిందా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికా సైనిక వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ మిస్టరీ వీడదు. ప్రస్తుతం ఈ విమానం కోసం రాడార్ డేటాను విశ్లేషిస్తూ గాలింపును వేగవంతం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

క్రూయిజ్ నౌకలో హంటావైరస్ తో ముగ్గురు మృతి..ప్రమాదంలో 150 మంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha