Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా పైలట్ మాకు చిక్కాడు.. ఇరాన్

అమెరికా పైలట్ మాకు చిక్కాడు.. ఇరాన్

వార్త 2 months ago

US Iran Conflict: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ అధికారిక మీడియా వెలువరించిన వార్త అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

24 గంటల వ్యవధిలో అమెరికాకు చెందిన రెండు ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాలను కూల్చేశామని ఇరాన్ ప్రకటించడం రక్షణ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ క్రమంలో ఒక అమెరికా పైలట్ తమ దళాలకు దొరికిపోయాడని పేర్కొనడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Read Also:Revolutionary Guard Corps: రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేతికి ఇరాన్‌ ప్రభుత్వం

US Iran Conflict: ఇరాన్ మీడియా కథనం ప్రకారం

తమ, గగనతలంలోకి వచ్చిన ఎఫ్-35 యుద్ధ విమానంపై సైనిక దళాలు దాడి చేసిన సమయంలో అందులోని నుంచి ఓ పైలట్ దూకేసి ఇరాన్ దళాలకు దొరికిపోయాడని తెలిపింది. పైలట్ తమకు చిక్కినట్టు ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ నివేదించింది. ''శత్రువు పైలట్‌ను ఎవరైనా సజీవంగా పట్టుకుని పోలీసులు, సైనిక దళాలకు అప్పగించిన వారికి ఇరాన్ భారీ రివార్డు అందజేస్తుంది'' అని ఇరాన్ మీడియాలో యాంకర్ చదివి వినిపించింది. అయితే, ఈ వార్తలపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.

అనంతరం ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి.. సామాన్య పౌరులు ప్రైవేట్ కార్లలో ప్రమాద స్థలం వైపు వెళ్లినట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది. నైరుతి ఇరాన్‌లో చాలా మంది ప్రజలు అమెరికన్ పైలట్‌ను పట్టుకోవడానికి ప్రైవేట్ కార్లలో అమెరికన్ యుద్ధ విమానం కూలిన ప్రదేశం చుట్టూ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పైలట్‌ను ఎవరూ హింసించకుండా చూడాలని ఇరాన్ సాయుధ దళాలు ప్రజలకు పిలుపునిచ్చాయని తెలిపింది.

కూలిన విమానాలు ఏవి?

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, ఈ పోరులో అమెరికాకు చెందిన రెండు రకాల శక్తివంతమైన విమానాలు కుప్పకూలాయి. మధ్య ఇరాన్ పైన ఎగురుతున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూల్చివేసినట్లు తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన శకలాల చిత్రాలను కూడా విడుదల చేసింది. అలాగే మరో F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని కూడా పేల్చేశామని తెలిపారు. బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ లేకెన్‌హీత్ నుంచి వచ్చిన ఈ విమానాన్ని కూడా కూల్చివేశామని, విమానం తోక భాగం శకలాలు దీనిని ధృవీకరిస్తున్నాయని ఇరాన్ వెల్లడించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha