US House of Representatives: భారత సంతతికి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, మైక్రోసాఫ్ట్ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన శివరామకృష్ణన్ 'సోమ' సోమశేఖర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.
టెక్నాలజీ రంగానికి, సరికొత్త ఆవిష్కరణలకు మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆయనను ప్రత్యేకంగా సత్కరించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్ కాంగ్రెస్ సభ్యురాలు సుజాన్ డెల్బెన్ మాట్లాడుతూ.. సోమశేఖర్‌ను తమ కమ్యూనిటీలో ఒక అద్భుతమైన టెక్నాలజిస్ట్, వ్యవస్థాపకుడు, గొప్ప నాయకుడిగా అభివర్ణించారు.
Indian American Tech Leaders
Read also: Oman coast ship attack: ఒమన్ తీరంలో మరో చమురు నౌకపై దాడి?.. క్లారిటీ ఇచ్చిన భారత్
దక్షిణ భారతదేశం నుండి మైక్రోసాఫ్ట్ శిఖరాలకు..
దక్షిణ భారత దేశంలో జన్మించిన సోమశేఖర్, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి లూసియానా స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత 1989లోనే ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరారు. ఆ కంపెనీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ‘విండోస్ ఎన్‌టీ’ (Windows NT) డెవలప్‌మెంట్‌లో ఆయన ప్రధాన భూమిక పోషించారు. తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, అంకితభావంతో సంస్థలో వేగంగా ఎదుగుతూ 2015 వరకు మైక్రోసాఫ్ట్ డెవలపర్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. “మైక్రోసాఫ్ట్‌లో మేమిద్దరం కలిసి పనిచేసిన రోజుల్లో ఆయన ఉత్సాహం, నిరంతరం ముఖంపై ఉండే చిరునవ్వు చుట్టుపక్కల వారిలో ఎంతో స్ఫూర్తిని నింపేవి” అని సుజాన్ డెల్బెన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
స్టార్టప్‌లకు దిక్సూచి.. మడ్రోనాలో ప్రస్థానం
మైక్రోసాఫ్ట్ నుండి విజయవంతంగా నిష్క్రమించిన అనంతరం సోమశేఖర్ ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘మడ్రోనా వెంచర్ గ్రూప్’ (Madrona Venture Group) లో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సంస్థ ద్వారా పసిఫిక్ నార్త్‌వెస్ట్ రీజియన్‌లో టెక్నాలజీ స్టార్టప్‌లకు అవసరమైన పెట్టుబడులు అందిస్తూ, ఎంతోమంది యువ వ్యవస్థాపకులకు (Entrepreneurs) మార్గనిర్దేశకుడిగా నిలిచారు.
క్రికెట్ ప్రమోషన్, సామాజిక సేవలో ముందు
కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా కమ్యూనిటీ సేవల్లోనూ సోమశేఖర్ చురుకైన పాత్ర పోషించారు. అమెరికాలో ప్రొఫెషనల్ క్రికెట్‌ను విస్తరించేందుకు ‘సియాటిల్ ఓర్కాస్’ (Seattle Orcas) క్రికెట్ ఫ్రాంచైజీకి సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. వీటితో పాటు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మహిళలకు ఉపాధి, ఉన్నత అవకాశాలు కల్పించే స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచారు.
సోమశేఖర్ విజయాల వెనుక ఆయన కుటుంబం పాత్ర ఎంతో ఉందని డెల్బెన్ కొనియాడారు. ఆయన భార్య అకిల, ఇద్దరు కుమార్తెలే ఆయన ప్రపంచమని, వారి మద్దతుతోనే ఆయన ఈ స్థాయికి చేరారని పేర్కొంటూ.. సోమశేఖర్ ప్రదర్శించిన దయ, వివేకం, స్ఫూర్తిని మనమంతా స్మరించుకోవాలని చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
లండన్‌లో దారుణం.. యువతిపై కిడ్నాప్, అత్యాచారం కేసులో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష!

