Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా రాజకీయాల్లో చైనా గూఢచారి కలకలం: ఐలీన్ వాంగ్ ఉదంతం

అమెరికా రాజకీయాల్లో చైనా గూఢచారి కలకలం: ఐలీన్ వాంగ్ ఉదంతం

వార్త 3 months ago

కాలిఫోర్నియాలోని అర్కాడియా కౌంటీ మేయర్‌గా పనిచేసిన ఐలీన్ వాంగ్, అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వ ప్రయోజనాల కోసం రహస్యంగా పనిచేసినట్లు ఎఫ్​బీఐ (FBI) నిర్ధారించింది.

2020 నుంచి 2022 మధ్య కాలంలో ఆమె చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా అమెరికాలోని చైనీస్-అమెరికన్ కమ్యూనిటీని ప్రభావితం చేసేందుకు ఆమెను ఒక పావుగా వాడుకున్నట్లు వెల్లడైంది.

Read Also: Trump Jinping Meet: ట్రంప్-జిన్‌పింగ్ చారిత్రక భేటీ: తైవాన్ వాణిజ్యం, రాజకీయాలపై ఉత్కంఠ

 America-China

America-China: ‘యూఎస్ న్యూస్ సెంటర్’ – ఒక ప్రచార అస్త్రం

ఐలీన్ వాంగ్, ఆమె భర్త మైక్ సన్ కలిసి ‘యూఎస్ న్యూస్ సెంటర్’ అనే వెబ్‌సైట్‌ను నడిపేవారు. ఇది పైకి సాధారణ వార్తా సంస్థలా కనిపించినప్పటికీ, వాస్తవానికి చైనా ప్రభుత్వం పంపే ‘ప్రోపగండా’ (ప్రచారం)ను వ్యాప్తి చేయడానికి ఉపయోగపడింది. చైనా అధికారులు వీచాట్ (WeChat) ద్వారా పంపే కథనాలను ఎటువంటి మార్పులు లేకుండా, స్థానిక వార్తలుగా ఈ సైట్‌లో ప్రచురించేవారు. దీని ద్వారా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను మలచడం వారి ప్రధాన లక్ష్యం.

చట్టపరమైన చిక్కులు, రాజీనామా

అమెరికా చట్టాల ప్రకారం, విదేశీ ప్రభుత్వాల తరఫున ఏజెంట్‌గా పనిచేసే ఎవరైనా అటార్నీ జనరల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఐలీన్ వాంగ్ ఈ నిబంధనను ఉల్లంఘించడమే కాకుండా, తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని చైనాకు సహకరించారు. నేరం రుజువైతే ఆమెకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎఫ్​బీఐ పక్కా ఆధారాలతో చుట్టుముట్టడంతో ఆమె తన మేయర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె భర్త మైక్ సన్ ఇప్పటికే తన నేరాన్ని అంగీకరించి, ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఘటన అమెరికా అంతర్గత భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసింది. ఒక విదేశీ ఏజెంట్ ఏకంగా మేయర్ స్థాయికి ఎదగడం అనేది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతోంది. ఎఫ్​బీఐ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు దీనిని “ప్రజా నమ్మకానికి జరిగిన ద్రోహం”గా అభివర్ణించారు. చైనా వంటి దేశాలు అమెరికా రాజకీయాల్లో ఏ స్థాయిలో చొరబడుతున్నాయో చెప్పడానికి ఈ కేసే నిదర్శనం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మళ్లీ బీజింగ్‌కు ట్రంప్.. షీ జిన్‌పింగ్‌తో దోస్తీ ఫలిస్తుందా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha