US Immigrants Online Application : అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల విభాగం (USCIS) వలస వ్యవస్థను ఆధునీకరించేందుకు భారీ మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు కాగితపు (Paper Forms) రూపంలో ఇచ్చే దరఖాస్తుల విధానానికి స్వస్తి పలుకుతూ, ఆన్‌లైన్ ఇ-ఫైలింగ్ (E-Filing) ను తప్పనిసరి చేసేందుకు ఫెడరల్ రిజిస్టర్‌లో నూతన నిబంధనను ప్రచురించింది.
ఆన్‌లైన్ విధానం యొక్క ముఖ్య నిబంధనలు ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌కు కనీసం 180 రోజులుగా అందుబాటులో ఉన్న ఏ ఫారమ్‌నైనా ఇకపై ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. ఈ కొత్త ఇ-ఫైలింగ్ నిబంధనను పూర్తిగా అమలు చేయడానికి ముందు USCIS కనీసం 60 రోజుల ముందుగా అధికారిక నోటీసు ఇస్తుంది. అభ్యర్థులు తమ USCIS ఆన్‌లైన్ ఖాతా ద్వారా నేరుగా వివరాలు నింపవచ్చు లేదా పూర్తి చేసిన ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను పీడీఎఫ్ (PDF) రూపంలో అప్‌లోడ్ చేయవచ్చు.
Read Also: FIFA World Cup: ఫిఫా వివాదంలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. యూఎస్ సాకర్ సమాఖ్య కీలక నిర్ణయం
US Immigrants Online Application
US Immigrants Online Application : ప్రభావితమయ్యే దరఖాస్తులు
ఈ కొత్త నిబంధన వల్ల కింది సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులు తప్పనిసరి కానున్నాయి:గ్రీన్ కార్డ్ దరఖాస్తులు మరియు పునరుద్ధరణలు (Green Card Renewals)కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పిటిషన్లుఅమెరికా పౌరసత్వ (Citizenship/Naturalization) దరఖాస్తులుఆశ్రయం (Asylum) మరియు తాత్కాలిక రక్షిత హోదా (TPS) అభ్యర్థనలుఉపాధి అనుమతి పత్రాలు (EAD – Employment Authorization). ఇ-ఫైలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలుకాగితపు ఫారమ్‌లను స్కాన్ చేయడం, డేటా ఎంట్రీ చేయడం వంటి ప్రక్రియలు తగ్గి దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగవంతమవుతుంది. డిజిటల్ డేటా ద్వారా అనుమానాస్పద దరఖాస్తులను గుర్తించడం, భద్రతా స్క్రీనింగ్ నిర్వహించడం మరియు మోసాలను అరికట్టడం సులభమవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో USCIS సుమారు 45.3 కోట్ల పేజీల కాగితపు పత్రాలను నిర్వహించడానికి $396 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది (పోస్టేజ్ ఖర్చులే $10 మిలియన్ల పైమాటే). డిజిటల్ విధానం వల్ల ఈ భారీ ఖర్చు ఆదా అవుతుంది. సాంకేతిక లోపాలు లేదా ఇతర ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయలేకపోయేవారికి మినహాయింపు లభిస్తుంది. దరఖాస్తుదారులు ప్రత్యేక ఫారమ్ ద్వారా USCIS ని మినహాయింపు కోసం కోరవచ్చు.ప్రతి అభ్యర్థనను అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఆమోదం తెలుపుతారు.మినహాయింపు పొందిన వారు కాగితపు రూపంలో దరఖాస్తు చేసుకోవడానికి $25 ఫైలింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

