YouTube Monetization : కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి ఆదాయం గడించాలనుకునే క్రియేటర్లకు గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ బిగ్ షాక్ ఇచ్చింది.
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించే మానిటైజేషన్ అర్హత ప్రమాణాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. లాంగ్ ఫార్మాట్ వీడియోలకు గత 12 నెలల్లో నిబంధనగా ఉన్న 4,000 గంటల వాచ్‌టైమ్‌ను ఏకంగా 8,000 గంటలకు పెంచింది. అలాగే షార్ట్స్ వీడియోల ద్వారా మానిటైజేషన్ పొందాలంటే గత 90 రోజుల్లో 10 మిలియన్లుగా ఉన్న వ్యూస్ నిబంధనను 20 మిలియన్లకు (2 కోట్లకు) పెంచడం జరిగింది. అయితే సబ్‌స్క్రైబర్ల సంఖ్య (1,000) నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. వేగంగా పెరుగుతున్న ప్లాట్‌ఫామ్ పరిమాణానికి అనుగుణంగా, కంటెంట్ నాణ్యతను పెంచడం మరియు స్పామ్, నకిలీ ఛానళ్లకు అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.

2027 నుంచి అమలులోకి: క్రియేటర్లపై పడే ప్రభావం
ఈ నూతన నిబంధనలు 2027 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరి మానిటైజేషన్ పొందుతున్న పాత క్రియేటర్లకు ఈ కొత్త ప్రవేశ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. అయితే, కొత్తగా ప్రారంభించే క్రియేటర్లకు మాత్రం మానిటైజేషన్ సాధించడం ఒక పెద్ద సవాలుగా మారనుంది. ప్లాట్‌ఫామ్‌పై రోజువారీగా వందల బిలియన్ల వ్యూస్ వస్తున్న నేపథ్యంలో, నిజమైన కంటెంట్ సృష్టికర్తలను ప్రోత్సహించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రారంభ దశలో ఉన్న క్రియేటర్లు నాణ్యమైన కంటెంట్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

