Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాకు రష్యా డీజిల్‌ సరఫరా

అమెరికాకు రష్యా డీజిల్‌ సరఫరా

వార్త 9 hrs ago

Russian Tankers Carrying Diesel: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఆంక్షల నడుమ రష్యా నుంచి అమెరికాకు డీజిల్ రవాణా అధికారికంగా పునఃప్రారంభమైంది.

నూతన ద్వైపాక్షిక దిగుమతి ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్‌తో కూడిన మూడు భారీ చమురు ట్యాంకర్లు ప్రిమోర్స్క్ ఓడరేవు నుండి బయలుదేరి ఉత్తర అమెరికా వైపు పయనిస్తున్నాయని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. 2023లో ఆంక్షలు కఠినతరం చేసిన తర్వాత రష్యా నుంచి అమెరికాకు డీజిల్ సరఫరా కావడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ అనంతరం ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రకటించారు.

IndiGo Extends Cancellation : అక్టోబర్ 31 వరకు సౌదీ అరేబియాకు ఇండిగో విమాన సర్వీసుల రద్దు

 Russian Tankers Carrying Diesel

Russian Tankers Carrying Diesel : విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు

అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల (Mid-term Elections) ముందు విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ సెగను చల్లార్చడమే లక్ష్యంగా ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) ప్రత్యక్ష భాగస్వామ్యంతో తొలి మూడు ఇంధన ట్యాంకర్లు ఇప్పటికే అట్లాంటిక్ మహాసముద్రం ద్వారా అమెరికా తూర్పు తీరానికి పయనమయ్యాయి. మెరైన్ ట్రాకింగ్ సంస్థ క్లెప్లర్ (Kpler) అందించిన డేటా ప్రకారం.. మొదటి ట్యాంకర్ శుక్రవారం నాటికి న్యూయార్క్ వైపునకు సంకేతాలను పంపడం ప్రారంభించిందని, ఇది నవంబర్ 7 నాటికి అమెరికా తీరానికి చేరుకోనుందని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. ఈ నివేదికలను క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు. తొలి ఆయిల్ ట్యాంకర్ వినియోగదారుల వైపు వెళ్తోందని, ఇకపై సాధారణ స్థాయి సరఫరాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

అమెరికాన్లకే మొదటి ప్రాధాన్యత..ఆందోళనలో భారతీయులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha