Work visa and immigration regulations : అమెరికా ప్రభుత్వంలో నివసిస్తున్న విదేశీయులు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు దేశం వెళ్లగొడతారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్కడి ప్రభుత్వం విదేశీయుల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఇటీవల మారుతున్న వర్క్ వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల గురించి వస్తున్న ఆందోళనలను ఆయన ఖండించారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కాదని రూబియో స్పష్టం చేశారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇండియానే టార్గెట్ చేసి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చుతున్నారు, టైట్ చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అమెరికా ఎప్పుడూ తన దేశ కార్మికులకు, జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రూబియో తేల్చి చెప్పారు.
Driving License: భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్రం కొత్త రూల్స్
Work visa and immigration regulations
Work visa and immigration regulations : దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి స్థానం
భారత ప్రభుత్వం కూడా ఎప్పుడూ తన దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కూడా తమ ప్రజలను, తమ కార్మికులను, తమ దేశాన్ని మొదట ఉంచుతుందని రూబియో స్పష్టం చేశారు. భారత్‌ను టార్గెట్ చేసి నిబంధనలు మార్చలేదని.. ఇది పూర్తిగా గ్లోబల్ పాలసీ అని తేల్చి చెప్పారు. గతంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అనేక లోపాలు ఉండేవని, బిజినెస్-సంబంధిత ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌లలో మోసాలు, దుర్వినియోగాలు విపరీతంగా జరిగాయని రూబియో తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

