Telangana Student Dies in USA: ఉన్నత భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఒక తెలంగాణ యువకుడు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు.
ఈ విషాదకర ఘటన అమెరికాలోని ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు
హనుమకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన భరత్ చందర్ రెడ్డి (29). భరత్ చందర్ రెడ్డి 2023లో ఉన్నత చదువుల (Higher Studies) కోసం అమెరికా వెళ్లాడు. గత నెల 25న ఫ్లోరిడాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ, 15 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
Telangana Student Dies in USA: గుంటూరుపల్లిలో తీవ్ర విషాదం
భరత్ చందర్ రెడ్డి మరణవార్త తెలియగానే ఆయన స్వగ్రామమైన గుంటూరుపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నో ఆశలతో విదేశాలకు పంపిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భరత్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయాన్ని కుటుంబ సభ్యులు అర్థవిస్తున్నారు.

