Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగ్గురి తర్వాత మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని విషాదం!

ముగ్గురి తర్వాత మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని విషాదం!

వార్త 1 week ago

Nalgonda Crime: నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మగబిడ్డ పుట్టలేదనే ఆవేదనతో ఓ బాలింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also :Kurla Landslide: కుర్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

Nalgonda Crime: వివరాల్లోకి వెళితే

మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత అనే మహిళ ప్రసవం కోసం వారం రోజుల క్రితం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వారం రోజుల క్రితం ప్రసవం జరగ్గా మమత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మమతకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాల్గోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆవేదనతో రగిలిపోయిన సదరు బాలింత, ఆసుపత్రి ఆవరణలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అత్తింటి వారు చేసిన వేధింపులు, మానసిక ఒత్తిడే మమత ఆత్మహత్యకు ప్రధాన కారణమని ఆమె బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కోహిర్ ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha