Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో బంగ్లాదేశీ పీహెచ్‌డీ జంట హత్య

అమెరికాలో బంగ్లాదేశీ పీహెచ్‌డీ జంట హత్య

వార్త 1 month ago

USF Students Murder: యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా (USF)లో పరిశోధక విద్యార్థులుగా రాణిస్తున్న జమిల్ లిమోన్ (27), నహిదా బ్రిస్టీ (27) తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కన్నారు.

జమిల్ పర్యావరణ విధానాలపై, నహిదా కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకున్నారు. కానీ, విధి మరోలా తలచింది.

Read Also:Attack on Trump : షూటర్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు - ట్రంప్

మిస్టరీగా మారిన అదృశ్యం.. ఆపై విషాదం

ఏప్రిల్ 16న క్యాంపస్‌లో చివరిసారిగా కనిపించిన ఈ జంట అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. పోలీసులు గాలింపు చేపట్టిన 10 రోజుల తర్వాత, ఏప్రిల్ 25న టాంపా బేలోని హోవార్డ్ ఫ్రాంక్‌ల్యాండ్ బ్రిడ్జ్ సమీపంలో జమిల్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది.నహిదా ఆచూకీ ఇంకా లభించనప్పటికీ, దొరికిన ఆధారాల ప్రకారం ఆమె కూడా హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ వార్తతో ఒక్కసారిగా యూనివర్సిటీలో మరియు అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

USF Students Murder: రూమ్‌మేటే హంతకుడు?

ఈ డబుల్ మర్డర్ కేసులో పోలీసులు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. వీరిద్దరినీ చంపింది మరెవరో కాదు, జమిల్ లిమోన్ రూమ్‌మేట్ అయిన హిషామ్ అబుఘర్బీహ్ (26) అని ప్రాథమిక విచారణలో తేలింది.నిందితుడు బాధితులతో కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. ముందస్తు ప్రణాళికతోనే హిషామ్ ఈ జంటను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, వీరి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలే ఈ హత్యలకు దారితీసి ఉండవచ్చు. రూమ్‌మేట్స్ మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదమా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రంప్ విందులో కాల్పుల కలకలం.. అక్కడే ఉన్నానన్న కేఏ పాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha