Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో భారతీయుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి

అమెరికాలో భారతీయుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి

వార్త 3 weeks ago

Indian Stabbed In US : అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. వెస్ట్ వ్యాలీ సిటీలో ఉన్న వ్యాలీ సిటీ మాల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న సయ్యద్ సోహైలుద్దీన్ అనే భారతీయుడిపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు.

మతం పేరుతో జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం మాల్‌లోకి వచ్చిన 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సన్ అనే వ్యక్తి, సోహైలుద్దీన్‌ వద్దకు వెళ్లి “నీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ మతం ఏంటి?” అని ప్రశ్నించాడు. ఆ తర్వాత వెంటనే తన వద్ద ఉన్న కత్తితో సోహైలుద్దీన్‌పై విచక్షణారహితంగా దాడి చేస్తూ, సుమారు 15 సార్లు పొడిచాడు.

Read Also: Petrol : రష్యా నుంచి ఇండియాకు పెరుగుతున్న పెట్రోల్ ఆర్డర్లు !

 Indian Stabbed In US

Indian Stabbed In US : అడ్డుకున్న స్థానికులు – ఆస్పత్రిలో బాధితుడు

ఈ ఘోరాన్ని చూసిన అక్కడి స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకున్నారు. అతడి చేతిలోని కత్తిని లాక్కొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో నిందితుడు లార్సన్ తలపై గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సోహైలుద్దీన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ట్రామా విభాగంలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాల నుంచి సోహైల్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు లార్సన్ సంచలన విషయాలు వెల్లడించాడు. బాధితుడి మత విశ్వాసాల కారణంగానే అతడిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిపై హత్యాయత్నం, నిషేధిత ప్రమాదకర ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైలుకు తరలించారు. నిందితుడి తీవ్రవాద భావజాలం దృష్ట్యా అతనికి బెయిల్ మంజూరు చేయరాదని దర్యాప్తు అధికారులు కోర్టును కోరారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ కూడా స్పందించింది.

అమెరికా-ఇరాన్ యుద్ధం .. 13 మంది భారతీయులు మృతి..దాడులను నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha