Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం..

అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం..

వార్త 2 weeks ago

Ananya Goli : అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పల్నాడు జిల్లాకు చెందిన అనన్య గోలి కంప్యూటింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది.

మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ నిర్వహించే 'మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్' అవార్డుల్లో భాగంగా ఆమెకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' గౌరవం లభించింది.

టెక్నాలజీలో ప్రతిభకు గుర్తింపు

హైస్కూల్ విద్యార్థుల్లో కంప్యూటింగ్ నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ అవార్డులను అందజేస్తారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో బాలికలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఎంపికైన కొద్దిమంది విద్యార్థుల్లో అనన్య స్థానం సంపాదించడం విశేషంగా మారింది.

Read also : Trade Deal : రేపటి నుంచి ఇండియా-US చర్చలు

 Ananya Goli

పల్నాడు నుంచి అమెరికా వరకు విజయ ప్రయాణం

అనన్య తల్లిదండ్రులు గోలి కృష్ణ చైతన్య, సంప సిన్హా. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారు 2014లో అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం అనన్య మిన్నెసోటాలోని ఈడెన్ ప్రైరీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ విమెన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవార్డు టెక్నాలజీ రంగంలో భవిష్యత్ నాయకులను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. చిన్న వయసులోనే ఈ గుర్తింపు సాధించిన అనన్యపై తెలుగు సమాజం ప్రశంసలు కురిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మయన్మార్‌లో ఘోర పేలుడు..55 మంది దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha