US Road Accident: అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన యువతి కట్టా నవ్య (25) దుర్మరణం పాలైంది.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ ఎమ్మెస్ (MS) పూర్తి చేసి స్థిరపడే క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి పరామర్శ
నవ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన యువతి కావడంతో ఆయన వెంటనే స్పందించి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నవ్య ఎంతో కష్టపడి అమెరికాలో చదువు పూర్తి చేసిందని, ఇంతలోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
Telangana Minister Komatireddy Venkat Reddy speaking to officials regarding the repatriation of the student’s body from the US.
US Road Accident: మృతదేహం తరలింపునకు అధికారులతో సంప్రదింపులు
విదేశాల్లో మరణించిన నవ్య భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి, ఆమె స్వగ్రామమైన చెరువుగట్టుకు తీసుకువచ్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఈ విషయమై ఆయన న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారులతో పాటు అమెరికాలోని భారత రాయబార కార్యాలయ (Embassy) అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రవాస భారతీయులు, తెలుగు అసోసియేషన్ల సహాయంతో అవసరమైన అన్ని పత్రాలు, ఫార్మాలిటీస్‌ను వేగంగా పూర్తి చేసి, నవ్య మృతదేహాన్ని వీలైనంత త్వరగా నల్గొండకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

