Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్రం కొత్త రూల్స్

భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్.. కేంద్రం కొత్త రూల్స్

వార్త 1 day ago

Driving License: దేశంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా భారతీయులు, విదేశీయులకు వేర్వేరు రంగుల్లో లైసెన్సులు జారీ చేయాలని యోచిస్తోంది.

ఈ ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహన నిబంధనల సవరణకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త విధానం అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సుపై వాహనదారుడి జాతీయతను కూడా స్పష్టంగా ముద్రించనున్నారు.

Hyderabad Green Water: కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్.. జలమండలి కొత్త ప్లాన్!

 Driving licenses in different colors for Indians and foreigners.. new rules from the Centre

Driving License: నోటరీ అఫిడవిట్లకు ఇకపై అనుమతి లేదా.. ఆధార్‌కు ప్రాధాన్యం

డ్రైవింగ్ లైసెన్సుల జారీలో నకిలీ పత్రాలను అరికట్టి, ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం పలు మార్పులను ప్రతిపాదించింది. వయసు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ అఫిడవిట్లు, జీవిత బీమా పాలసీలను ఇకపై అంగీకరించకూడదని సూచించింది. వీటికి బదులుగా ఆధార్, ఓటర్ ఐడీ, ఈ-రేషన్ కార్డు, ఇటీవల జారీ చేసిన విద్యుత్ లేదా గ్యాస్ బిల్లులను గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని ప్రతిపాదించింది.

రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచేందుకు ఆన్‌లైన్ సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు ఉండనుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా డ్రైవింగ్ లైసెన్సుపై బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలను ముద్రించాలని సూచించింది. ఆధార్ అథెంటికేషన్ ద్వారా వివరాలను మార్చుకునే వారికి ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.

దరఖాస్తుల పరిష్కారానికి గడువు

డ్రైవింగ్ లైసెన్సులో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను 15 రోజుల్లోగా, చిరునామా మార్పు దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రతిపాదించారు. చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అధికారులు నిర్ణయం తీసుకోకపోతే, దానిని ఆమోదించినట్లుగా పరిగణించే నిబంధనను కూడా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ మార్పులు ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది మార్గదర్శకాలను ప్రకటించనుంది.

Epaper: epaper.vaartha.com

HCA కేసులో సీఐడీ కీలక చర్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha