Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్ళీ చమురు మంటలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్ళీ చమురు మంటలు

వార్త 5 days ago

America-Iran War: అమెరికా, ఇరాన్ (War) దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

హార్ముజ్ జలసంధి సమీపంలో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల ఖతార్ ముడి చమురును రవాణా చేస్తున్న ‘కికు’ అనే భారీ నౌకపై జరిగిన దాడి, దానికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు అంతర్జాతీయంగా సరఫరా ఆందోళనలను పెంచాయి. అయితే, పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా నివారించేందుకు ఇరు దేశాలు దాడులను విరమించి మంగళవారం దోహాలో సమావేశం కావడానికి అంగీకరించడంతో మార్కెట్ సెంటిమెంట్ కొంత మెరుగైంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 1.9 శాతం పెరిగి బ్యారెల్‌కు 73.39 డాలర్లకు చేరినప్పటికీ.. ఆ తర్వాత కొంత లాభాన్ని కోల్పోయింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల సమీపంలో స్థిరంగా ట్రేడ్ అవుతోంది. హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం కొనసాగుతున్నప్పటికీ, పర్షియన్ గల్ఫ్‌లో వందలాది నౌకలు నిలిచిపోవడంతో కొన్ని ట్యాంకర్లు తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

Read Also: Lucas Trejo's family death:భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!

 America-Iran War

America-Iran War: దేశీయంగా ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగాయి

అయితే అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దేశీయంగా ఇంధన ధరలు నాలుగు సార్లు పెరిగి, లీటరుపై దాదాపు 7.5 నుండి 8 రూపాయల వరకు అదనపు భారం పడింది. ప్రస్తుత ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102.12 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 95.20 రూపాయలుగా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలలో ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో అత్యధికంగా పెట్రోల్ ధర 115.73 రూపాయలు , డీజిల్ ధర 103.82 రూపాయలుగా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ 113.51 రూపాయలు, డీజిల్ 99.82 రూపాయలుగానూ, ముంబైలో పెట్రోల్ 111.21 రూపాయలు, డీజిల్ 97.83 రూపాయలుగానూ ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర 110.89 రూపాయలు, డీజిల్ ధర 98.80 రూపాయలు ఉండగా, చెన్నైలో లీటరు పెట్రోల్ 108.01 రూపాయలకు , డీజిల్ 99.66 రూపాయలకు విక్రయించబడుతోంది.

బంగ్లాదేశకు ఈ ఏడాది ఖచ్చితంగా వెళ్తా - హసీనా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha