Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా?

అమితంగా పల్లీలు తింటే ప్రమాదమా?

వార్త 1 week ago

Peanuts : వేరుశనగ పప్పులను పేదల బాదం అని పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో బాదం పప్పులో ఉండే అన్ని రకాల పోషకాలు, విటమిన్లు దీని ద్వారా లభిస్తాయి.

చలికాలంలో లేదా సాయంత్రం వేళల్లో టైంపాస్ కోసం వేయించిన పల్లీలను గుప్పెళ్లు గుప్పెళ్లుగా తినడం చాలా మందికి అలవాటు. అయితే, అమృతం అయినా మితిమీరితే విషమే అన్నట్లు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగలను ప్రతిరోజూ అతిగా తినడం వల్ల శరీరానికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే పల్లీలను పరిమితంగానే తినాలి. ఎందుకంటే వేరుశనగ గింజలలో క్యాలరీలు, కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని క్రమం తప్పకుండా విపరీతంగా తింటే శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి, చాలా వేగంగా బరువు పెరుగుతారు. జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్: పల్లీలలో ఫైబర్ ఉన్నప్పటికీ, వీటిని ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు వేధిస్తాయి.

Read Also : Fiber in Food: రోజూ తినే ఫుడ్‌లో ఫైబర్ సరిపోతోందా? లేకపోతే వచ్చే ప్రమాదకర జబ్బులివే!

 Peanuts

Peanuts : పోషకాలను గ్రహించడంలో అడ్డంకులు

లివర్ దెబ్బతినే ప్రమాదం: వేరుశనగలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు లేదా వాటిని అతిగా తీసుకున్నప్పుడు శరీరంలో అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన టాక్సిన్ (విష పదార్థం) పేరుకుపోతుంది. ఇది కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీనివల్ల కాలేయం బలహీనపడటం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేరుశనగల్లో ఫైటిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. శరీరంలో దీని పరిమాణం పెరిగినప్పుడు, మనం తినే ఇతర ఆహారాల నుండి లభించే ఐరన్ (ఇనుము), జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది.

Peanuts

ముఖం వాపు రావడం

చాలా మందికి పల్లీల వల్ల అలర్జీ ఉంటుంది. పల్లీలను అతిగా తినడం వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, దురద, గొంతు, ముఖం వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక చిన్న గుప్పెడు (సుమారు 30 నుండి 40 గ్రాములు) వేరుశనగ పప్పులను మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పైన పేర్కొన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని పల్లీలను పరిమితంగా తీసుకోండి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నిద్రలేమి వేధిస్తోందా? మీ అలసటకు చెక్ పెట్టే సూపర్ టిప్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha