Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మ జ్ఞాపకార్థం 6.5 లక్షల మొక్కలు నాటిన సాయాజీ షిండే

అమ్మ జ్ఞాపకార్థం 6.5 లక్షల మొక్కలు నాటిన సాయాజీ షిండే

వార్త 4 months ago

Sayaji Shinde: వెండితెరపై ప్రతినాయకుడిగా (విలన్‌గా) భయపెట్టే నటుడు సాయాజీ షిండే, నిజ జీవితంలో మాత్రం పర్యావరణ రక్షకుడిగా రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

తన తల్లి జ్ఞాపకార్థం మహారాష్ట్ర అంతటా ఏకంగా 6.5 లక్షలకు పైగా స్వదేశీ మొక్కలను నాటి పచ్చదనాన్ని పంచుతున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న “సహ్యాద్రి దేవరాయ్” అనే సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందరికో పర్యావరణ స్ఫూర్తినిస్తోంది.

 MotherMemoryTreePlantation

Read also: Kara Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'కర' సినిమా

మాతృప్రేమతో మొదలైన పచ్చని యజ్ఞం

2016లో మహారాష్ట్ర తీవ్ర కరవు బారిన పడింది. ఎండ తీవ్రతకు, నీడ లేక ప్రజలు, పశువులు అల్లాడిపోవడాన్ని సాయాజీ షిండే గమనించారు. అదే సమయంలో ఆయన తల్లి 92 ఏళ్ల వయసులో మరణించారు. ఆ కన్నతల్లి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనే బలమైన సంకల్పంతో ఈ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. తన తల్లి బరువుకు సమానమైన విత్తనాలను సేకరించి, రాష్ట్రవ్యాప్తంగా నాటడం ప్రారంభించారు. ఆ చెట్ల నీడలో, ప్రకృతిలో తన అమ్మను చూసుకోవడమే ఆయన లక్ష్యం.

Sayaji Shinde: 2 వేల నుండి 6.5 లక్షల మొక్కల వరకు..

మొదట్లో తన స్వగ్రామంలో కేవలం 2,000 మొక్కలతో ప్రారంభమైన ఈ పర్యావరణ ఉద్యమం, నేడు మహారాష్ట్రలోని 48 ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటివరకు సాయాజీ షిండే ఆధ్వర్యంలో 6.5 లక్షలకు పైగా మొక్కలను నాటారు. కేవలం చిన్న మొక్కలే కాకుండా, రోడ్ల విస్తరణలో భాగంగా నరికివేయడానికి సిద్ధంగా ఉన్న 200కు పైగా భారీ మర్రి వృక్షాలను వేర్లతో సహా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించి పునఃప్రతిష్టించారు (Tree Translocation).

వాచ్‌మన్‌ నుండి స్టార్ నటుడి వరకు..

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సాయాజీ షిండే ప్రస్థానం ఎందరికో ఆదర్శం. నటుడిగా మారకముందు ఆయన జీవనోపాధి కోసం వాచ్‌మన్‌గా కూడా పనిచేశారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను, విషాదాన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చి, సమాజానికి మేలు చేస్తున్న సాయాజీ షిండే.. వెండితెరపై విలన్‌గా మెరిసినా, నిజ జీవితంలో మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్న అభినవ భగీరథుడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

'పెద్ది' సినిమా పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha