Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' సినిమా పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం

'పెద్ది' సినిమా పైరసీకి అడ్డుకట్ట.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం

వార్త 2 weeks ago

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆన్‌లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడానికి మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైన న్యాయపరమైన ఉత్తర్వును జారీ చేసింది.

ఇంటర్నెట్‌లో ఈ చిత్రాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా అప్‌లోడ్ చేయడం, కాపీ చేయడం, ప్రసారం చేయడం లేదా విడుదల చేయడం వంటివి చేయకూడదంటూ కోర్టు కఠినమైన పైరసీ నిరోధక ఆదేశాలను ఇచ్చింది.

సినిమా కాపీరైట్ రక్షణకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. చిత్ర యూనిట్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఒకవేళ ఈ సినిమా అనధికారికంగా ఇంటర్నెట్ ద్వారా లీక్ అయితే, థియేట్రికల్ రన్‌పై తీవ్ర ప్రభావం పడి నిర్మాతలకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ సినిమాకు ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్’ (Anti-Piracy Injunction) జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Read Also : Viswanand and Sons Release Date: సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' రిలీజ్ డేట్ ఫిక్స్!

 Madras High Court’s key decision to stop piracy of the movie ‘Peddhi’

Peddi Movie: ఏమిటీ యాంటీ పైరసీ ఇంజంక్షన్?

ఏదైనా ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ కంటెంట్‌ను కాపీరైట్ హక్కుదారులు తమ అనుమతి లేకుండా అక్రమంగా కాపీ కాకుండా చూసుకోవడానికి, అలాగే పైరసీ వెబ్‌సైట్లలో ప్రసారం కాకుండా నిరోధించడానికి కోర్టుల ద్వారా పొందే ఒక బలమైన న్యాయపరమైన రక్షణ ఉత్తర్వునే ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్’ అంటారు.

సాధారణంగా పైరసీదారులు ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, కొత్త డొమైన్ లేదా కొత్త యూఆర్ఎల్ (URL) తో మళ్లీ అదే సినిమా కంటెంట్‌ను ఇంటర్నెట్ లోకి తెస్తుంటారు. అలా జరగకుండా ఉండటానికి, కొత్తగా పుట్టుకొచ్చే పైరసీ సైట్లను కూడా ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేసేలా కోర్టులు ఈ ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఉత్తర్వులను ఇస్తుంటాయి. దీనివల్ల ‘పెద్ది’ సినిమా డిజిటల్ కంటెంట్‌కు పూర్తి స్థాయి భద్రత లభించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha