Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మాయిలకు మైనర్లకు రక్షణ ఏది?: ప్రవీణ్ కుమార్

అమ్మాయిలకు మైనర్లకు రక్షణ ఏది?: ప్రవీణ్ కుమార్

వార్త 4 days ago

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది..?

  • అమ్మాయిలకు మైనర్లకు రక్షణ ఏది?
  • నిందితులను కాపాడేందుకు పనిచేస్తున్నారా..?
  • తన సొంత జిల్లాగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి..
  • జడ్చర్ల నడిబొడ్డున కత్తులతో దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నారు..

⁠Jadcherla Vaishnavi Case: బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలమూరు బిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డ పాలమూరు లోనే జడ్చర్ల కేంద్రంలో కంప్యూటర్ సైన్స్ పీజీ చేసిన విద్యార్థికి రక్షణ లేకుండా పోయిందని, పట్టపగలే దుండగులు కత్తులు పట్టుకొని నటి రోడ్డులో సంచరిస్తున్న పట్టించుకోని వ్యవస్థ నెలకొందని బి.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ప్రేమోన్మాది చేతిలో పట్టణానికి చెందిన వైష్ణవి దారుణ హత్యకు గురి కావడంతో బుధవారం జడ్చర్ల లోని బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైష్ణవి తల్లిదండ్రులు రామచందర్ శ్రీలతలను ఓదార్చారు.జడ్చర్ల హత్య ఉదంతంపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం

Read also: Telangana liquor prices: తెలంగాణ మందుబాబులకు షాక్.. జూన్ 2 నుండి మద్యం ధరల పెంపు?

 Telanganalo Shantibhadratalu issue Jadcherla

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ హయాంలో నిత్యం పెట్రోలింగ్ వ్యవస్థ పని చేసేదని, రూ.700 కోట్లతో పోలీసు వ్యవస్థలో అనేక మార్పులను అదునాతన వాహనాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. పోక్సో బాధితులకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని , నిందితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎప్పుడు కేసీఆర్ పాలన వస్తుందని తమ ధనామా నా ప్రాణాలకు రక్షణ దొరుకుతుందని ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాల పక్షాన తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి..

కేంద్రమంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తన కుమారుడు సాయి భగీరథ కేసు విషయంలో నైతిక బాధ్యత వహించాలన్నారు. బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి సిగ్గుందా అని ప్రశ్నించారు. సాయి భగీరథ, బాధితురాలు అయిన మైనర్ బాలిక ఇద్దరూ బావ మరదళ్లలా తిరుగుతున్నారని, మైనర్ బాలిక కార్ డ్రైవ్ చేస్తూ తన ఇష్ట పూర్వకంగానే కార్యక్రమాలు చేశారని అనడానికి సిగ్గుండాలి అని ద్వజమెత్తారు. మీకు ఆడపిల్లలు లేరా అంటూ ప్రశ్నించారు. బిజెపి నేతలు మొదటి నుంచి చెబుతున్నా భేటీ బచావో బేటి పడావో కేవలం డ్రామాలు మాత్రమే అని స్పష్టమైంది అన్నారు. బండి సంజయ్ సోషల్ మీడియా సభ్యులు అమ్మాయిల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అమ్మాయే మొత్తం తప్పు చేసింది అబ్బాయి మంచోడు అనేలా క్రియేట్ చేస్తుందన్నారు.

Jadcherla Vaishnavi Case: కేసీఆర్ పాలనలోనే ప్రజలకు నిజమైన రక్షణ

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సిగ్గు లేకుండా నిందితులను వెనకేసుకొచ్చే మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో కూడా బాధ ఉంటుందని అనడం ఎంతవరకు సమంజసం అన్నారు.. ఎవరి మీద సానుభూతి చూపిస్తున్నావు మల్లు రవి, అందుకేనా నిన్ను నాగర్కర్నూల్ ప్రజలు ఎంపీగా గెలిపించింది అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికి పెట్రోలింగ్ వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. 18 గంటలు పనిచేస్తున్న రివ్యూలు చేస్తున్నాను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నిజంగా రివ్యూ చేస్తే ఇప్పటికీ ఇద్దరు కమిషనర్లు సస్పెండ్ కావాలన్నారు. తన ఆస్తులు పంచుకోవడానికి అన్నదమ్ముల ఆస్తులు కాపాడుకోవడానికి పోలీస్ వ్యవస్థ ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట మహబూబ్నగర్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య, బి ఆర్ ఎస్ నాయకులు పాలాది రామ్మోహన్, నాగిరెడ్డి, ఇంతియాజ్ ఖాన్, టైగర్ నరసింహ, కరాటే శ్రీను, ఆలూరి శశికిరణ్ తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha