Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతీయ తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రభంజనం

జాతీయ తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రభంజనం

వార్త 3 months ago

National Taekwondo Championship: తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా బృందావన్ గార్డెన్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు.

మే 15, 16, 17 తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీలలో జిల్లా జట్టు తమ మేటి నైపుణ్యంతో ఏకంగా 16 బంగారు, 9 వెండి, 1 కాంస్య పతకాలను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.

Read Also : HMWSSB GM ACB Raids: హైదరాబాద్ ట్యాంకర్ మాఫియా గుట్టురట్టు..ఏసీబీ దాడుల్లో మైండ్ బ్లాక్ అయ్యే ఆస్తులు!

 Vizianagaram athletes excel in the National Taekwondo Competitions

National Taekwondo Championship: డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన విజేతలు

ఈ పోటీల్లో ఎన్. హర్షిణి, టి. నాగ సాయి జతిన్, వై. ముకేష్ విశ్వనాథ్, వి. రోహిణి సత్యలు అసాధారణ ప్రతిభ కనబరిచి తలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే డి. ప్రియవల్లి, డి. కార్తికేయ, ఎస్. గగన్, ఆర్. పూర్ణ చంద్రు, వై. చరిష్మా, టి. సాంకీర్తన, ఎస్. సత్విక్, డి. ధనీష్‌లు ఒక్కో బంగారు పతకాన్ని సాధించి జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. ఎం. భావ్య శ్రీ, పి. సహస్ర సమ్హిత, డి. ప్రియవల్లి, ఎ. ముకేష్ మనికంఠ, టి. మేఘనా శ్రీ, ఆర్. తేజ శ్రీ, జి. ఫలక్ కుమార్, జి. తరుణ్, డి. ధనేష్‌లు ప్రతిభ చాటి రజత పతకాలను సొంతం చేసుకోగా, కాంస్య (బ్రోంజ్) పతకాన్ని ఎస్. సత్విక్ సాధించారు.

అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌ల అభినందనలు

​జాతీయ స్థాయిలో విజయనగరం పేరును మారుమోగించిన క్రీడాకారులను విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్. వేణుగోపాలరావు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ఇంతటి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన కోచ్‌లు యశస్విని, చైతన్యల కృషిని వారు కొనియాడారు. విజేతలైన క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, దేశానికి కీర్తి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చరిత్ర ఆనవాళ్లుకు ప్రసిద్ధి మెదక్ పర్యాటక ప్రాంతాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha