Dailyhunt
అమ్మాయిని కౌగిలించుకున్న రోబో.. అసలేం జరిగిందంటే?

అమ్మాయిని కౌగిలించుకున్న రోబో.. అసలేం జరిగిందంటే?

వార్త 1 week ago

Robot Hugging Girl: చైనాలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, మనుషులతో కలిసి పనిచేసేటప్పుడు ఇలాంటి రోబోల వల్ల ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లు ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చాయి.

Read Also : India, New Zealand: వాణిజ్య ఒప్పందంపై భారత్, న్యూజిలాండ్ సంతకాలు

 A humanoid robot hugging a student.

Robot Hugging Girl: ఈవెంట్‌లో ఏం జరిగింది?

చైనాలోని షాన్సీ (Shaanxi) ప్రావిన్స్‌ లో ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో క్రీడా మరియు సాంస్కృతిక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా ఒక విద్యార్థినితో కలిసి రోబో డ్యాన్స్ చేయాల్సి ఉంది.డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ హ్యూమనాయిడ్ రోబో అకస్మాత్తుగా ఆ విద్యార్థిని వైపు తిరిగి, ఆమెను గట్టిగా కౌగిలించుకుంది.ఇది చూసి షాక్ అయిన నిర్వాహకులు వెంటనే, రోబోను విద్యార్థిని నుంచి పక్కకు లాగారు. అదృష్టవశాత్తూ ఆ విద్యార్థిని ఎలాంటి గాయాలు కాకుండా బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. రోబో స్వయంగా ఈ నిర్ణయం తీసుకుందా లేక ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? అని చాలామంది ప్రశ్నించారు.నివేదికల ప్రకారం, ఆ రోబోట్‌ను ఒక నిర్దిష్ట పనితీరు కోసం రూపొందించారు. సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని విశ్వవిద్యాలయ అధికారులు అంటున్నారు. కొంతమంది నిపుణులు దీనికి సాఫ్ట్‌వేర్ లోపం లేదా సిగ్నల్ అంతరాయం కారణమని భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha