అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు ఎలమంచిలి, రాంబిల్లి వంటి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి.
రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో సెకన్ల పాటు భూమి కదలడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.7గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే ప్రజలందరూ అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి ఖాళీ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు.
Read also: Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రి పటిష్టతపై ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల అధ్యయనం ముమ్మరం

Earthquake tremors felt in Anakapalli
Anakapalli Earthquake: 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం.. వణికిపోయిన ఇళ్లు
ఈ భూప్రకంపనల కేంద్రం భూమికి సుమారు 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాసపూడిపాలెంకు నైరుతి దిశలో 50 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని సామాన్లు కదలడం, గృహోపకరణాలు శబ్దం చేయడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అయింది, చాలామంది తమకు ఎదురైన అనుభవాలను వాట్సాప్ స్టేటస్‌లుగా పంచుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రకంపనలే రావడం గమనార్హం.
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తల సూచన
ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లోనూ గత కొంతకాలంగా ఇలాంటి స్వల్ప భూప్రకంపనలు వస్తున్నట్లు ఎన్‌జీఆర్‌ఐ (NGRI) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమి లోపలి పొరల్లో ఏర్పడే ఖాళీలు లేదా సర్దుబాట్ల వల్ల ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తాయని, వీటితో పెద్దగా ప్రమాదం ఉండదని వారు వివరించారు. ప్రభుత్వం కూడా అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. వరుసగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు కొంత కలవరపడుతున్నప్పటికీ, నిపుణులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

