Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన కొండ చరియల పటిష్టతపై శాస్త్రీయ అధ్యయనం చేయడానికి వచ్చిన బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎమ్ఆర్ఎం) శాస్త్రవేత్తల బృందం తమ క్షేత్రస్థాయి పరిశోధనలను ముమ్మరం చేసింది..
ఈ సాంకేతిక బృందం ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ సమగ్ర సర్వే నిర్వహించనుంది. తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య అకుంఠిత దీక్షతో అత్యధిక ఉష్ణోగ్రతలతో నిప్పులు చెరుగుతున్నప్పటికీ, భక్తుల భద్రతే ధ్యేయంగా ఎన్బాఆర్ఎం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు.
Read Also: Paritala Sunita on Women's Bil: పార్లమెంట్లో మహిళా బిల్లుపై ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం
NIRM scientists intensify study on the strength of Indrakiladri
Indrakeeladri Temple: కొండ రాళ్ల పటుత్వంపై నిశిత పరిశీలన
రెండవ రోజు, కొండలైట్ రాతి స్వరూపంతో కూడిన ఇంద్రకీలాద్రిపై హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల రాళ్లలో కలిగే మార్పులను మరియు వాటి పటుత్వాన్ని ఈ బృందం నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ రహదారి వెంట మరియు ఘాట్ రోడ్ల వెంబడి బయటకు కనిపిస్తున్న కొండ రాళ్ల పొరల నుండి భూగర్భసాంకేతిక మరియు భౌగోళిక నమూనాలను బృందం సేకరిస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఈ సర్వేలో భాగంగా, అత్యాధునిక వరికరాల సహాయంతో రాళ్ల స్థితిగతులు, మట్టితో మిళితమైన ప్రాంతాలు మరియు తరచుగా రాళ్లు జారిపడే ప్రదేశాలను శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు.. మాస్టర్ ప్లాన్ అమలు
రాబోయే రోజుల్లో కొండపై నిర్మించనున్న పాశుపాతాలయం మరియు 2వ ఘాట్ రోడ్డు వంటి బృహత్తర ప్రణాళికలకు గల అనుకూల చరిస్థితులపై ఈ బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది. ఈ సర్వే నివేదిక
ఇంద్రకీలాద్రి భవిష్యత్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది. ఈ అధ్యయనం ఆధారంగా చేపట్టే రక్షణ చర్యల వల్ల భక్తులకు కొండ చరియల ముప్పు నుండి శాశ్వత విముక్తి లభించడమే కాకుండా, దేవస్థాన మాస్టర్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అత్యాధునిక సాంకేతికత, శాస్త్రీయ దృక్పథంతో రూపొందించే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ వివేదికతో ఇంద్రకీలాద్రి మరింత సురక్షితమైన, సుందరమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లనుందని, భవిష్యత్ కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో ముందడుగు పడిందని ఆలయ ఇఓ వికె శ్రీనానాయక్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

