Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anakapalli News: టీచర్లకు చుక్కలు చూపించిన ఇద్దరు బాలికలు

Anakapalli News: టీచర్లకు చుక్కలు చూపించిన ఇద్దరు బాలికలు

వార్త 3 months ago

Anakapalli News: విద్యార్థులు బడికి వెళ్లి బుద్ధిగా పాఠాలు చదువుకోవాలి.. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది.

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆశపడుతుంటారు. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ పిల్లలను చదివిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కొంతమంది విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Aluru Arikera Gurukul School: 8వ తరగతి బాలుడిపై సీనియర్ల అమానుషం!

ఇటీవల కాలంలో పుస్తకాలు పట్టుకుని చదవాల్సిన సమయంలో సెల్ ఫోన్ పట్టుకుని రీల్స్ చేస్తూ కనిపిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. స్కూల్ యూనిఫామ్‌లోనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, లైక్స్ కోసం వివిధ రకాల కంటెంట్ చేయడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దలు అడిగితే అలక వహించడం, మందలిస్తే స్పందించకపోవడం వంటి ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది.

మనస్తాపానికి గురైన ఈ బాలికలు స్కూల్ వదిలిన తర్వాత ఇంటికెళ్లకుండా ఎటో వెళ్లిపోయారు

తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు చేసిన పని.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. ఓ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలు రోజు మాదిరిగానే వాళ్లు పాఠశాలకు వెళ్లారు. అయితే ఇద్దరు చదువులో వెనుక బడడంతో ఉపాధ్యాయులు వారిని మందలించారు. అంతేకాదు ఇంస్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసే విషయంలో పెట్టే శ్రద్ధ చదువుపై ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. ఇకపై రీల్స్ చేయొద్దని హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ బాలికలు స్కూల్ వదిలిన తర్వాత ఇంటికెళ్లకుండా ఎటో వెళ్లిపోయారు.

సాయంత్రం వరకు బాలికలు ఇళ్లకు రాకపోయేసరికి కంగారుపడిపోయిన పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో బాలికల కోసం గాలింపు చేపట్టారు.స్కూల్ నుంచి.. బాలికల వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్సు ఎక్కినట్టు గుర్తించి ఆ బస్సు వెళ్ళిన గ్రామాల వరకు ఆరా తీశారు. చివరకు అల్లూరి జిల్లా జర్రెల గ్రామంలో బంధువులు ఇంటికి వెళ్లారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడే ఉన్న ఆ ఇద్దరినీ గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారిని ప్రశ్నిస్తే అసలు విషయం మెల్లగా చెప్పారు. బాలికలు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha