Ananthapur Road accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ సహా ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
Read Also : Medaram Jampanna Vagu: మేడారంలో ఉగ్రరూపం దాల్చిన జంపన్న వాగు.. భక్తుడు గల్లంతు!
Horrific accident in Anantapur district… Three burnt alive?
Ananthapur Road accident: భయానక దృశ్యాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
మంటలు పూర్తిగా ఆరిపోయిన అనంతరం కారు శకలాలను పరిశీలించిన స్థానికులకు లోపల మూడు పుర్రెలు కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

