Medaram Jampanna Vagu: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను కుండపోత వర్షాలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి.
గత 48 గంటలుగా నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి జలమయమయ్యాయి. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రజలు ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Bihar crime: భోజనం ఆలస్యమైందని వదినను గొడ్డలితో నరికి చంపిన మరిది!
Jampanna Vagu turns ferocious at Medaram; devotee swept away!
Medaram Jampanna Vagu: పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగులో స్నానానికి దిగిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఓ భక్తుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వాగులు, వంకలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వర్షాల తీవ్రత, వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ముందస్తు చర్యగా ఈరోజు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ములుగు జిల్లా కన్నాయిగూడెంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అధికారులు తక్షణమే స్పందించి వరద బాధితుల కోసం అత్యవసర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పాతబస్తీలో దారుణం.. బాగా చదువుతున్నాడని స్నేహితుడిపై కత్తి దూసిన యువకుడు!

