Dailyhunt
అనంతపురం జిల్లాలోని రైతుల ఆత్మహత్యలు అధికం

అనంతపురం జిల్లాలోని రైతుల ఆత్మహత్యలు అధికం

వార్త 1 week ago

Farmers Suicides: రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలోనే కౌలు రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభలు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. స్థానిక గవిమఠం వద్ద నుండి పట్టణ ప్రధాన వీధుల్లో కౌలు రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

Read also: Leander Paes: టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌కు 'X' కేటగిరీ భద్రత

 Farmers Suicides: Farmer suicides are high in Anantapur district

అనంతరం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేసిన వై.రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో పంటలు అంతంత మాత్రమే పండుతాయని అయితే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వాల నుండి ప్రోత్సాహాలు కరువై వ్యవసాయం నష్టాల ఊబిలో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు అధికమై రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల రంగయ్య, సిపిఎం పార్టీ నాయకులు మధుసూదన్, కృష్ణమూర్తి, రాయుడు, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతిపై పగ పెంచుకున్నారు.. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha