Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Read Also : Palnadu Road Accident: పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Horrific accident in Anantapur: Two dead after car overturns.
Anantapur Road Accident: బ్రాహ్మణపల్లి సమీపంలో దుర్ఘటన
ప్రమాద వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఇన్నోవా వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాఘవేంద్ర, నాగరాజు అనే వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఆసుపత్రికి గాయపడిన వారి తరలింపు
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తేందుకు ఏపీ అధికారుల యత్నం.. తెలంగాణ అధికారులు అడ్డగింత

