Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతపురంలో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

అనంతపురంలో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం

వార్త 3 months ago

Mega Health Camp: అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు అనంతపురంలో ఈనెల 31వ తేదీన మెగా ఉచిత వైద్య శిబిరం.. ఈనెల 31వ తేదీన అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఏ.బాలకొండయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also :AP IAS Transfers 2026: ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 Mega Health Camp: Services available at the Collectorate starting from 8:00 AM.

అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గం.ల వరకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కలెక్టర్ వారి సహకారంతో జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మెగా ఉచిత వైద్య శిబిరంలో లభ్యమయ్యే వైద్య పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.రక్తపోటు , ఈసీజీ, టుడే ఎకో, సి బి పి, ఎల్ ఎఫ్ టి, ఆర్ ఎఫ్ టి, లిపిడ్ ప్రొఫైల్, రక్త చక్కెర పరీక్షలు (ఖాళీ కడుపున & భోజనం తర్వాత).
లభ్యమయ్యే స్పెషలిస్ట్ సేవలు

  • జనరల్ ఫిజీషియన్
  • జనరల్ సర్జన్
  • కార్డియాలజిస్ట్ (గుండె నిపుణుడు)
  • గైనకాలజిస్ట్ (స్త్రీ రోగ నిపుణుడు)
  • ఆర్థోపెడిక్ (ఎముకల నిపుణుడు)
  • న్యూరో ఫిజీషియన్ (నరాల నిపుణుడు)
  • దంత వైద్యుడు
  • ENT (చెవి, ముక్కు, గొంతు)
  • యూరాలజిస్ట్ (మూత్రపిండాల నిపుణుడు)
  • నేత్ర వైద్యుడు

ముఖ్యమైన సూచన :

  • రక్త చక్కెర (ఖాళీ కడుపున) & లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం, దయచేసి ఉదయం 8:00 గంటలకు ఖాళీ కడుపుతో రావాలి.మెగా ఉచిత వైద్య శిబిరంలో వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తారు. తదుపరి చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది. మెగా ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య బృందాలు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. మెగా హెల్త్ క్యాంపును జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో గతంలో అక్రిడేషన్ కలిగిన సీనియర్ మీడియా మిత్రులు కూడా వైద్య సేవలు పొందవచ్చునని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం: రాయదుర్గంలో భారీ బైక్ ర్యాలీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha