Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనసూయ ఫిర్యాదుతో యాక్షన్.. సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడు అరెస్ట్!

అనసూయ ఫిర్యాదుతో యాక్షన్.. సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడు అరెస్ట్!

వార్త 2 months ago

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో సాగుతున్న అసభ్యకర ప్రచారానికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు మరియు పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వేగంగా స్పందించి మరో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు

గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అనసూయపై పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన దొరెపల్లి చంటి. చర్యలు ఇతను ‘చంటిదొరెపల్లి’ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also: Om Shanti Disco Shanti Movie: దెయ్యం వర్సెస్ పిచ్చివాళ్ల క్రేజీ కామెడీ.. 'ఓం శాంతి డిస్కో శాంతి' విడుదల

 Another accused arrested in the Anasuya case.

Anasuya Bharadwaj: గతంలోనూ అరెస్టులు

అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇటీవలె కడప జిల్లాకు చెందిన జనార్ధన్ అనే వ్యక్తిని కూడా ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుమారు 70 మందికి పైగా వ్యక్తులు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై అనసూయ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక్కొక్కరినీ గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కేసు నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు నెటిజన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగం ఇతరులను దూషించడానికి లేదా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సోషల్ మీడియాను వాడితే ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠిన శిక్షలు తప్పవు. నిఘా సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్ నిరంతరం నిఘాలో ఉంటుందని, అజ్ఞాతంగా ఉండి వేధింపులకు పాల్పడినా టెక్నాలజీ సాయంతో పట్టుకుంటామని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha