Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంచనాలను మించిన అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు

అంచనాలను మించిన అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు

వార్త 1 week ago

Telugu states in debt : తెలుగు రాష్ట్రాలు అప్పుల వలయంలో విలవిలలాడుతు న్నాయి. ఏళ్ల క్రితం చేసిన పాత అప్పుల అసలు, వడ్డీ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది.

కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందుతున్నది చాలా తక్కువగా ఉంటోంది. గత మూడేళ్ల సగటును తీసు కుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాల్లో 58శాతం సొమ్ము పాత అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపుకే వెళ్లిపోయింది. రాష్ట్రానికి 42 శాతమే సొమ్ము అందింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, 2025-26 సంవ త్సరపు బడ్జెట్లపై ఓ అధ్యయనం పేరిట రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన అప్పుల్లో 70 శాతం, 2024-25లో తెచ్చిన అప్పుల్లో 56శాతం, 2025-26లో తెచ్చిన అప్పుల్లో 49శాతం సొమ్మును పాత అప్పులు, వడ్డీలు తిరిగి చెల్లించడానికే వినియోగించింది. దక్షిణాదిలో అత్య ధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా తమిళనాడు రూ. 95, 300 కోట్లతో నిలిచింది. ఆ తర్వాత ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటక రూ.12,000 కోట్లు, కేరళ రూ.36,338 కోట్లు రుణ సమీకరణ చేశాయి.

Read Also : Amaravati: రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపు పూర్తి: మంత్రి నారాయణ

 Telugu states in debt

Telugu states in debt : అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి

రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ అంచనాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రతిపాదనలు రూ. 54,009 కోట్లు ఉండగా ఇప్పటి వరకు సేకరించిన రుణాలు అక్షరాలా రూ.83,300 కోట్లకు (154.23 శాతం) చేరాయి. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే బడ్జెట్ అంచనాల కంటే దాదాపు రూ.29,000 కోట్లకుపైగా అదనపు అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వైఫల్యానికి అద్దం పడుతున్నది. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలు సృష్టించుకోవడంలో విఫలమైన తెలంగాణ సర్కార్ ప్రతి నెలా అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన తెలంగాణపై ఈ అదనపు భారం భవిష్యత్తులో తీవ్ర పరి ణామాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. సంక్షేమ పథకాలు, జీతభత్యాల కోసం కూడా అప్పుల వైపు చూడటం ఆర్థిక క్రమశిక్షణారాహిత్యమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట గ్యారం టీ అప్పులు చేసింది. 2025 మార్చి నాటికి సవరించిన అంచనాల ప్రకారం ఈ అప్పులు రూ.2,41,528 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి లో రాష్ట్ర అప్పుల శాతం పెరిగిపోతోంది. ఎఫ్ఎల్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీఎస్టీపీలో అప్పులు 25శాతానికి మించకూడదు. కానీ ఆ పరిమితి దాటుతున్నాయి.

వడ్డీలు దీనికి అదనం

2021లో 28.8శాతం, 2022లో 28శాతానికి చేరాయి. 2025- 26లో రాష్ట్ర బడ్జెట్ అంచనాల ప్రకారం జీఎస్డీపీలో అప్పు లు 27.5 శాతం వరకు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న నేపథ్యం లో భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సిన అప్పులు మొత్తం గణ నీయంగా పెరగనుంది. 2025-64 మధ్యలో అప్పుల అసలు సొమ్మే రూ.3,63,883 కోట్లు కట్టాల్సి ఉందని, వడ్డీలు దీనికి అదనమని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో రూ. 69,300 కోట్లు, ఏపీ సర్కార్ రూ.56,072 కోట్ల అప్పు సేకరించించి నట్టు గణాంకాలు వెల్లడించారు. 2025-26లో తెలంగాణ ప్రభుత్వం మొదటి మూడు నెలల్లో రూ.17,400 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.32,500కోట్లు, మూడో త్రైమాసి కంలో రూ.19,400కోట్లు ఇలా తొమ్మిది నెలల్లో రూ.69,300 కోట్ల అప్పులు చేసినట్టు వెల్లడించారు. అదేవిధం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి మూడు నెలల్లో రూ. 26, 572 కోట్లు, రెండో క్వార్టర్ లో రూ.17,600 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,900 కోట్లు, ఇలా తొమ్మిది నెలల్లో రూ. 56,072 కోట్ల రుణ సమీకణ చేసినట్టు వివరిం చారు.

 Telugu states in debt

రుణ సమీ కరణ లక్ష్యం

కేంద్రం విడుదల చేసిన డాటా ప్రకారం బిజెపిపాలిత మహారాష్ట్ర రూ.99,000 కోట్ల రుణ సమీకరణతో దేశంలో నే మొదటిస్థానంలో నిలిచింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందా? అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమి తులను గాలికొదిలేసిందా? అంటే తాజా గణాంకాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవ త్సరంలో ఇప్పటికే తెలంగాణ సర్కార్చేసిన
అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోయి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది చాలదన్నట్టు ప్రభుత్వం ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రూ.2 540కోట్ల రుణాన్ని సమీ కరించింది. ఇందులో 19ఏండ్ల కాలపరిమితితో 7.75 వార్షిక వడ్డీకి రూ.540 కోట్లు, 28 ఏండ్ల కాలపరిమితితో 7.70 వడ్డీకి రూ.1,౦౦౦ కోట్లు, 30ఏండ్ల కాలపరిమితితో 7.69 వడ్డీకి మరో రూ.1,000 కోట్లు తీసుకున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి తెచ్చిన మొత్తం అప్పు రూ.85,840 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్న రూ. 54,009 కోట్ల వార్షిక రుణ సమీ కరణ లక్ష్యంకంటే 58.93 అధికం. గత ఐదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయి. 2022-23లో వార్షిక బడ్జెట్అంచనాలో కేవ లం 61 శాతానికే పరిమితమైన రుణాలు ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరుగకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇతర ఖర్చుల కోసం పూర్తిగా మార్కెట్ రుణాలపైనే ఆధారపడుతున్నది. అంచనాలకు మించి అడ్డగోలుగా తెస్తున్న అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీలు భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాకు పెనుభారంగా మార డం, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయ మని ఆర్థిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-ఇస్కా రాజేష్ బాబు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కాకినాడ జిల్లాలో రూ.683 కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha