Kakinada to Hissar Train: కాకినాడ-హిసార్ రెగ్యులర్ రైలును ప్రారంభించిన ఎంపి ఉదయ్ శ్రీనివాస్.త్వరలో వారణాసి, ఢిల్లీ, జోద్పూర్, తిరువనంతపురానికి రైళ్లు కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిసార్ వెళ్లే నూతన రైలును మంగళవారం కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసును ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజప్తి చేయడంతో సానుకూలంగా స్పందించి రెగ్యులర్ రైలు ఏర్పాటు చేశారు. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో జండా ఊపి ప్రారంభించి అనంతరం ఎంపీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పలు రైల్వే స్టేషన్ల ను రూ.683 కోట్ల తో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
Modern Kakinada Railway Station view
Kakinada to Hissar Train: రూ. 683 కోట్లతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్పు
అలాగే త్వరలో కాకినాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి, జోద్ పూర్, తిరువనంతపురంకు నేరుగా రైలు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హిసార్ వెళ్లే రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుండి బయలుదేరి చర్లపల్లి మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర తో పాటు ముస్లింలు పవిత్రంగా భావించే అజ్మీర్ మీదుగా సాగుతుందన్నారు. దీంతో పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ నుండి షిరిడి మధ్య నడుస్తున్న రైలులో మరిన్ని బోగిలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకినాడ జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని రాబోయే రోజుల్లో కాకినాడ నుండి రైల్వే కనెక్టివిటీని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

