దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) భారత భూభాగంలోకి ప్రవేశించాయి.
ఇవి ఈరోజు అండమాన్ నికోబార్ దీవులను తాకినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతంలోనూ రుతుపవనాల గమనానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, దీనివల్ల దేశంలోకి వర్షాల రాకకు మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు.
Read Also ; బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Southwest Monsoon Updatesమే 26న కేరళలోకి ప్రవేశం
అండమాన్‌ను తాకిన రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతుండటంతో, షెడ్యూల్ కంటే ముందే అంటే మే 26వ తేదీ నాటికే ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళకు వచ్చే రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే వస్తుండటం సాగు పనులకు సిద్ధమవుతున్న రైతులకు ఊరటనిచ్చే అంశం. అయితే, రుతుపవనాలు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే ఎండల తీవ్రత తగ్గుతుందని భావించలేము. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల మరో వారం రోజుల పాటు వేడితో పాటు ఉక్కపోత మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఎల్నినో ఎఫెక్ట్
ఈ ఏడాది వర్షపాతంపై వాతావరణ నిపుణులు కీలక అంచనాలను పంచుకున్నారు. అంతర్జాతీయంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్నినో’ (El Nino) ప్రభావం ఈసారి రుతుపవనాలపై పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి అభిప్రాయపడ్డారు. ఈ ఎల్నినో పరిస్థితుల కారణంగా ప్రస్తుత సీజన్‌లో పడే మొత్తం వర్షపాతం సాధారణం కంటే కొంత తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవచ్చని, ముఖ్యంగా జూన్ నెలలో వర్షాల తీవ్రత సాధారణంగానే ఉండనుందని అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

