Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh: అంబటి రాంబాబు మళ్ళీ జైలు కు

Andhra Pradesh: అంబటి రాంబాబు మళ్ళీ జైలు కు

వార్త 4 months ago

వైసీపీ నేత (Andhra Pradesh) అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఇబ్బందులు తప్పలేదు. తనపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి… ఈ కేసు మరో తలనొప్పిగా మారింది.

ఈ కేసులో ఆయనను పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన సత్తెనపల్లి పోలీసులు ఇవాళ సత్తెనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితంమే ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు ముగిశాయి. కాసేపట్లో జడ్జి తీర్పును వెలువరించబోతున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధిస్తే (Andhra Pradesh) మళ్లీ ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. 2023 సంక్రాంతి సమయంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లను అంటగట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha