Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh: నేటి నుంచి పీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

Andhra Pradesh: నేటి నుంచి పీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీసెట్‌కు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య పాల్‌కుమార్ వెల్లడించారు.

ఈ నెల 13వ తేదీ నుంచి పీసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.

Nellore Gudur Teacher Attack: గూడూరు టీచర్‌పై దాడి..నిందితుడు అరెస్ట్!

తప్పుల సవరణకు అవకాశం

ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాలని భావిస్తున్న విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. రూ.1,000 అపరాధ రుసుంతో మే 15 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో మే 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 24 నుంచి 26 వరకు తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అదే నెల 28 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha