Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగన్‌వాడీ దరఖాస్తులకు మిగిలినది 2 రోజులే

అంగన్‌వాడీ దరఖాస్తులకు మిగిలినది 2 రోజులే

వార్త 2 days ago

Anganwadi Jobs:తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. వికారాబాద్ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీకి మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా సంక్షేమాధికారి పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో మొత్తం 264 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

New employee benefits: కొత్త ఉద్యోగులకు 15 వేల కానుక

 Anganwadi Jobs

పోస్టుల వివరాలు

మొత్తం 264 పోస్టుల్లో 102 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు కాగా, 162 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి.

  • మొత్తం ఖాళీలు: 264
  • అంగన్‌వాడీ టీచర్లు: 102
  • అంగన్‌వాడీ ఆయాలు: 162

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు:

ఐసీడీఎస్ ప్రాజెక్టు (ICDS Project)టీచర్ పోస్టులుఆయా పోస్టులుమొత్తం ఖాళీలు
కొడంగల్133144
మర్పల్లి211435
పరిగి2778105
తాండూరు232851
వికారాబాద్181129
మొత్తం102162264

Anganwadi Jobs:విద్యార్హతలు & ఇతర నిబంధనలు:

  • విద్యార్హత: దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్/ఆయా పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అభ్యర్థులు లభించని పక్షంలో, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఇతర నిబంధనలు: వయోపరిమితి, స్థానికత వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం & ఎంపిక ప్రక్రియ:

  1. ఆన్‌లైన్ దరఖాస్తు: అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు సమయంలో పూర్తి వివరాలను సరిగ్గా నమోదు చేసి, ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
  2. హార్డ్ కాపీల సమర్పణ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు తమ దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నేరుగా సమర్పించాల్సి ఉంటుంది.
  3. ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత ఛైర్మన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు త్వరితగతిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

Epaper: epaper.vaartha.com

దరఖాస్తులకు ముగుస్తున్న గడువు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha