Dailyhunt
అంగరంగ వైభవంగా సత్యదేవుని దివ్య కల్యాణం

అంగరంగ వైభవంగా సత్యదేవుని దివ్య కల్యాణం

వార్త 1 week ago

Annavaram Satyanarayana Swamy: కాకినాడ జిల్లా ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం మహోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి శ్రీస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు నూతన వధూవరుడు శ్రీ సత్యదేవుడును వెండి గరుడ వాహనంపై ఆశీనులు గావించి వధువు అనంతలక్ష్మి సత్యవతి దేవి అమ్మవారిని వెండి గజవాహనంపై పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్న శ్రీ సీతారాములవారిని వెండి పల్లకిలో ఆసీనులు గావించి రాత్రి 7 గంటలకు కొండ దిగువన అన్నవరం గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.

Read Also: Visakha Express Assault Case: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం.. వివాహితపై ఏసీ బోగీలో అత్యాచారం

 The glorious wedding of Annavaram Satyadev

Annavaram Satyanarayana Swamy: కల్యాణ వేదికపై సుముహూర్త ఘట్టం

తదుపరి నూతన వధూవరులను కల్యాణవేదిక వద్దకు తోడుకొని వచ్చి వార్షిక కల్యాణ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై సత్యదేవుడును అనంతలక్ష్మి సత్యవతి దేవి అమ్మవార్లను మరో పక్కన సీతారాముల వారిని ఆసీనులు గావించారు. అనంతరం దివ్య కల్యాణ మహోత్సవ తంతు ప్రారంభించారు. ఓ శుభముహూర్తాన నూతన వధూవరులు శిరస్సుపై అర్చకులు జీలకర్ర బెల్లం ఉంచారు. సుముహూర్తంలో మాంగల్య ధారణ గావించారు.

పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కాకినాడ జిల్లా కలెక్టర్ హరింద్రప్రసాద్ పట్టువస్త్రములు మంచి ముత్యములు సమర్పించారు. అన్నవరం దేవస్థానం తరుపున దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఇఓ న్నల్ల సూర్యచక్రధర్ రావు, పాలకమండలి సభ్యులు పట్టు వస్త్రములు సమర్పించారు. శ్రీ స్వామి వారి దివ్య కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. కల్యాణం అనంతరం భక్తులకు గ్రామస్తులకు శ్రీ స్వామి వారి ప్రసాదం తలంబ్రాలు పంపిణీ చేశారు. శ్రీ స్వామి వారి దివ్య ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ ఆదాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha