Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం.. వివాహితపై ఏసీ బోగీలో అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం.. వివాహితపై ఏసీ బోగీలో అత్యాచారం

వార్త 1 month ago

Visakha Express Assault Case: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివసిస్తున్నారు.

ఈ నెల 26న (ఆదివారం) బాధితురాలు తన సొంత ఊరికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీ ఎక్కింది.జనరల్ బోగీలో ఉన్న ఆమెను ఒక గుర్తుతెలియని వ్యక్తి పరిచయం చేసుకుని, నమ్మించి ఏసీ బోగీలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Read Also:AP Registration : ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ ఆదాయం

ఆలస్యంగా వెలుగులోకి..

అయితే బాధిత మహిళ, మంగళవారం బాధితురాలు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల సహాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.

 Visakha Express Woman Assault Case

Visakha Express Assault Case: ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైలు ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి రైల్వే శాఖ ‘మేరీ సహేలి’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ప్రయాణికులు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే 139 నంబర్‌కు డయల్ చేయాలని, అధికారులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఆస్తి వ్యామోహం.. కనిపెంచిన వారినే సజీవ దహనం చేయాలనుకున్న కిరాతక పుత్రిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha