AP Politics హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ మద్దతు అనితకు దన్నుగా నిలిచింది.
ఒక మహిళా నాయకురాలిని, అది కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక వైసీపీ వికృత రాజకీయం ఉందని లోకేశ్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Read also: Kalyandurgam: ఆ హామీ నెరవేర్చాకే ఓట్లు అడుగుతా:ఎమ్మెల్యే సురేంద్రబాబు
Nara Lokesh extends support to Vangalapudi Anitha.
మహిళల గౌరవాన్ని కాపాడాలి
అనిత కష్టపడే తత్వం, ధైర్యం ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టాయని లోకేశ్ గుర్తుచేశారు. రాజకీయాల్లో విమర్శలు విధానాల పరంగా ఉండాలి కానీ, వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలు ఎంత ప్రయత్నించినా అనిత సాధించిన విజయాలను తగ్గించలేరని, ఆమె గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళను కించపరచడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు.
AP Politicsబహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
అనితతో పాటు రాష్ట్రంలోని ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైసీపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాల గురించి సమాధానం చెప్పలేక, ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇలాంటి సంస్కృతిని ఎప్పుడో తిరస్కరించారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని లోకేశ్ సూచించారు.
Epaper: epaper.vaartha.com
పీజీ విద్యార్థులను వేధించినందుకు ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సస్పెండ్

