Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్న ప్రేమ వ్యవహారం.. చెల్లి బలి: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్న ప్రేమ వ్యవహారం.. చెల్లి బలి: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వార్త 1 month ago

Vikarabad crime: వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డేగావత్ తులసీబాయి(23) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ధారూరు ప్రాంతానికి చెందిన ఈమె, వికారాబాద్‌లోనే ఒక గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. తన అన్న చేస్తున్న పొరపాట్ల వల్ల తాను ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందనే మనస్తాపంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Visakha Express Assault Case Updates: విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

Vikarabad crime: అసలు ఏం జరిగింది?

తులసీబాయి అన్న రాజు ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో పనిచేసే మౌనిక అనే యువతిని అతను గత ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో మౌనికను తన చెల్లి (తులసీబాయి) అద్దెకు ఉంటున్న గదిలోనే ఉంచాడు. అయితే, ఇటీవల ప్రేమికుల మధ్య గొడవలు జరగడంతో మౌనిక అక్కడి నుండి వెళ్లిపోయింది. దీంతో రాజు, గతంలో తమద్దరూ కలిసి దిగిన ఫోటోలను పంపి మౌనికను బెదిరించడం మొదలుపెట్టాడు. రాజు వేధింపులు భరించలేక మౌనిక వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్న రాజుకు, అతని కానిస్టేబుల్ చెల్లి తులసీబాయి కూడా సహకరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొంది.

మనస్తాపంతో ఆత్మహత్య

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి, అన్న చేసిన పని వల్ల తనపై కేసు నమోదు కావడం, విచారణ ఎదుర్కోవాల్సి రావడం తులసీబాయిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అన్న ప్రేమ వ్యవహారం తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని దెబ్బతీస్తోందని బాధపడుతూ ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తులసీబాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'ఫెయిల్" అవుతానని భయంతో బాలిక ఆత్మహత్య.. రిజల్ట్ లోఏంజరిగిందంటే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha