Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

వార్త 1 month ago

Visakha Express Assault Case Updates: విజయవాడ రైల్వే పోలీసులు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు గత ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి నడికుడికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు.

జనరల్ బోగీలో రద్దీ ఎక్కువగా ఉండటంతో వారు బాత్‌రూం సమీపంలో కూర్చున్నారు. రైలు విజయవాడకు చేరువవుతున్న సమయంలో, ఏసీ కోచ్‌లో బాయ్‌గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శౌరవ్‌ బగ్ది వారిని గమనించాడు. దయతో పిలుస్తున్నట్లు నటించి, ఖాళీగా ఉన్న ఏసీ బోగీలోకి రమ్మని వారిని ఆహ్వానించాడు.

Read Also: AP Registration : ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ ఆదాయం

నిందితుడి మాటలు నమ్మి దంపతులు ఏసీ బోగీలోకి వెళ్లారు. భర్త బాత్‌రూం వద్ద ఫోన్ చూసుకుంటూ నిల్చోగా, లోపలికి వెళ్లిన వివాహితపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె నోరు మూసేసి బెదిరించి అత్యాచారం చేశాడు.

Visakha Express Assault Case Updates: జీరో ఎఫ్ఐఆర్ ద్వారా వెలుగులోకి.. నిందితుడి గుర్తింపు

ఘటన జరిగిన తర్వాత బాధితురాలు భయంతో ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ముభావంగా ఉండటం గమనించిన భర్త గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే మంగళవారం వారు రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి, కేసును విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. బుధవారం రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నిందితుడు శౌరవ్‌ బగ్దిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం.. వివాహితపై ఏసీ బోగీలో అత్యాచారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha