Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నామలై కోసం ఏదైనా చేసేవాణ్ని - పవన్

అన్నామలై కోసం ఏదైనా చేసేవాణ్ని - పవన్

వార్త 2 months ago

Annamalai : తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, యువ నేత కె. అన్నామలైపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.

అన్నామలై ఒక అద్భుతమైన, సమర్థుడైన నాయకుడని కొనియాడిన పవన్.. దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణాదిలో అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒకవేళ తాను కనుక భారతీయ జనతా పార్టీ (BJP) లో ఉండి ఉంటే, అన్నామలైని తిరిగి పార్టీలోకి యాక్టివ్‌గా తెచ్చేందుకు లేదా ఆయనకు సరైన గుర్తింపు దక్కేలా చేసేందుకు ఎంత దూరమైనా వెళ్లేవాడినని, అందుకోసం తాను ఏదైనా చేసేవాడినని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అన్నామలై నాయకత్వ పటిమపై పవన్ చూపిన ఈ విపరీతమైన నమ్మకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!

దక్షిణాది నాయకత్వంపై పవన్ ఫోకస్

భారతీయ జనతా పార్టీ అంతర్గత పరిణామాలు, జాతీయ నాయకత్వంపై కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్రనాయకత్వాన్ని గమనిస్తే వారిలో అత్యధికులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే కనిపిస్తున్నారని ఆయన విశ్లేషించారు. అయితే, బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావాలన్నా, ఇక్కడి ప్రజలకు దగ్గరవ్వాలన్నా కేవలం ఉత్తరాది వ్యూహాలు సరిపోవని, ఇక్కడి స్థానిక నేతలను గుర్తించి, వారిని పెద్ద పీట వేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో బీజేపీని నడిపించగల అంతటి సమర్థత, ప్రజాకర్షణ ఉన్న అతికొద్ది మంది నాయకులలో అన్నామలై ఒకరని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అన్నామలై నిష్క్రమణతో పార్టీకి నష్టం లేదు: తమిళనాడు బీజేపీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha