Annadata sukhibhava release : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరబోతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక 'అన్నదాత సుఖీభవ' (ADSB) మరియు 'ప్రధాన్ మంత్రి కిసాన్' (PM-KISAN) పథకాల సంయుక్త తొలి విడత ఆర్థిక సహాయాన్ని ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు.
నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఉన్న వేలాది మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు నేరుగా జమ కానున్నాయి.
Read also: PM Viksit Bharat Rozgar Yojana:విజయనగరంలో 'పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' జాతర
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,77,545 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద, అలాగే 1,41,921 మంది రైతులు పీఎం-కిసాన్ 23వ విడత కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత సాధించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సంయుక్త ఉత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ 'అన్నదాత సుఖీభవ' కింద ప్రతీ రైతుకు రూ. 5,000 చొప్పున, కేంద్ర ప్రభుత్వ 'పీఎం-కిసాన్' పథకం కింద రూ. 2,000 చొప్పున నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జమ చేయనున్నారు.

నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు - నిధుల పూర్తి వివరాలు
నెల్లూరు జిల్లా పరిధిలోని 8 ప్రధాన నియోజకవర్గాల వారీగా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య మరియు విడుదలవుతున్న నిధుల వివరాలను కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారికంగా విడుదల చేశారు.
| నియోజకవర్గం | అన్నదాత సుఖీభవ (ADSB) లబ్ధిదారులు | పీఎం-కిసాన్ (PM-KISAN) లబ్ధిదారులు | మొత్తం విడుదలవుతున్న నిధులు |
| ఉదయగిరి | 45,275 మంది | 37,021 మంది | ₹30.04 కోట్లు |
| ఆత్మకూరు | 34,223 మంది | 28,633 మంది | ₹22.83 కోట్లు |
| సర్వేపల్లి | 27,958 మంది | 22,610 మంది | ₹18.50 కోట్లు |
| కావలి | 18,305 మంది | 13,632 మంది | ₹11.87 కోట్లు |
| కోవూరు | 16,938 మంది | 12,161 మంది | ₹10.90 కోట్లు |
| వెంకటగిరి | 16,015 మంది | 12,921 మంది | ₹10.59 కోట్లు |
| గూడూరు | 13,532 మంది | 10,832 మంది | ₹8.93 కోట్లు |
| నెల్లూరు | 5,299 మంది | 4,111 మంది | ₹3.47 కోట్లు |
| మొత్తం జిల్లా | 1,77,545 మంది | 1,41,921 మంది | ₹117.16 కోట్లు |
నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతు కుటుంబాలందరికీ కలిపి తొలి విడతలోనే ఏకంగా రూ. 117.16 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈకేవైసీ (e-KYC), ఆధార్ అనుసంధానం తప్పనిసరి
అర్హులైన ప్రతీ రైతు కుటుంబానికి ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నిధులు చేరాలనే ఉద్దేశంతో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. రైతులు తమ భూమి వివరాలు (Webland Data), కుటుంబ డిజిటల్ సర్వే వివరాలు మరియు తమ యాక్టివ్ బ్యాంకు ఖాతాలను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం (Aadhaar Seeding) చేసుకుని ఉండాలని కలెక్టర్ సూచించారు. అప్పుడే ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు.
Annadata sukhibhava release : పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ - లింగంగుంటలో సీఎం చంద్రబాబు శ్రీకారం
ఈ నిధుల విడుదల ప్రత్యేక కార్యక్రమాన్ని రేపు జిల్లావ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా “పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్” గా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రైతు వేదికల ద్వారా ప్రత్యేక సభలు ఏర్పాటు చేయనున్నారు.
- రాష్ట్ర స్థాయి వేడుక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగంగుంట గ్రామంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ఘనంగా జరగనుంది. సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్త నిధులను విడుదల చేస్తారు.
- జాతీయ స్థాయి వేడుక: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా, తారకేశ్వర్ నుండి శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు డిజిటల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఈ చారిత్రాత్మక రైతు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ వేడుకలలో నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు, రైతు సంఘాల ప్రతినిధులు అందరూ తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆ ప్రకటనలో కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

